హేమావతి సిద్దేశ్వరస్వామి ఆలయ స్థల పురాణం ఏంటంటే..

హేమావతి సిద్ధేశ్వర క్షేత్రం స్థల పురాణం గురించి తెలుసుకుందాం. పూర్వం ఈ ప్రాంతం పేరు హేంజేరుగా ఉండేది. ఆ సమయంలో నొళంబ పల్లవ రాజుల కులదైవం పరమేశ్వరుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. ఈ వంశానికి చెందిన చిత్రశేఖర, సోమశేఖర అనే సోదరులకు సంతానం లేరట. దీంతో వారు తమ కులదైవమైన శివుని పూజించసాగారట. ఒకసారి శివుడు వారికి కలలో కనిపించి, తనను పూజిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని చెప్పాడట. అలాగే సంతానం కలిగాక తనకు లింగాకారంలో కాకుండా మానవాకారంలో విగ్రహాన్ని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడంట! ఆ తర్వాత శివుడు చెప్పిన ప్రకారమే ఈ వంశంలో ఒక ఆడపిల్ల జన్మించింది. ఆ పాపకు హేమావతి అని పేరు పెట్టి శివాజ్ఞ ప్రకారం శివాలయం నిర్మించి మానవాకారంలో శివుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట.

హేమావతి సిద్దేశ్వరస్వామి ఆలయ స్థల పురాణం ఏంటంటే..
హేమావతి సిద్దేశ్వరస్వామి ఆలయ స్థల పురాణం ఏంటంటే..

హేమావతి సిద్ధేశ్వర క్షేత్రానికి సంబంధించి మరో కథనం కూడా ఉంది. చిత్రశేఖర, సోమశేఖర సోదరులు సంతానం కలిగే ఉపాయం చెప్పమని కులగురువులను ఆశ్రయించారట. గురువులు తమ దివ్యదృష్టితో వాస్తవాలు తెలుసుకున్నారట. అనంతరం శివుని శాపం వల్లనే వారికి సంతానం కలగడం లేదని చెప్పారట. దీనికి పరిష్కారమేంటని చిత్రశేఖర, సోమశేఖర సోదరులు కోరగా.. అందుకు పరిహారంగా మానవ రూపంలో శివుడిని ప్రతిష్టించి, పూజించమని సూచించారట! ఆ సోదరులు రాజగురువులు చెప్పినట్లే చేసి ఒక ఆడపిల్లని సంతానంగా పొందారట. ఆ పాపకు హేమావతి అని పేరు పెట్టారట. పూర్వం ఈ ప్రాంతంలో హేమావతి నది ప్రవహించేదని అంటారు.

Share this post with your friends