ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. వాటిలో ఒక్కోదానికి ఒక్కో శక్తి ఉంటుంది. దర్శించుకున్నవారికి ఊహించనంత ప్రయోజనం చేకూరుతుంది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శిస్తే వ్యాధులు దూరమవుతాయని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని పోలిన శివలింగమే తెలంగాణలోనూ ఉంది. ఇది పూర్తిగా మరకతంతో తయారైంది. కాబట్టి దీనిని సేవిస్తే సకల వ్యాధులు నయమవుతాయట. హైదరాబాద్‌కు 48 కి.మీ దూరంలో చందిప్ప అనే గ్రామంలో ఈ శివలింగం దర్శనమిస్తుంది. పూర్తిగా మరకతంతో తయారైన ఈ సోమేశ్వర లింగాన్ని సేవిస్తే వ్యాధులు నివృత్తితో పాటు సకల ఊశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం.

అలాగే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఇంతకూ ఈ పవిత్ర క్షేత్రం ఎక్కడుంది? ఆ విశేషాలేమిటో ఈ కథనంలో చూద్దాం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో మహారాష్ట్రలోని పర్లిలో వైద్య నాథేశ్వర లింగం ఒకటి. ఇక్కడి శివుడు భక్తులకు ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడనే విశ్వాసం ఉంది. ఈ శివయ్య పోలిన పోలిన బ్రహ్మసూత్రంతో మెరిసే మరకత శివలింగమే తెలంగాణలో చందిప్ప గ్రామంలో దర్శనమిస్తుండటం విశేషం. ఈ మరకత సోమేశ్వర లింగానికి శతాబ్దాల చరిత్ర ఉంది. దీనిని సేవిస్తే సకల వ్యాధులు నివృత్తి అవుతాయని, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.
