ఈ స్వామివారిని స్థిరవారం దర్శించుకోవాలంటే పెట్టి పుట్టి ఉండాలట..

ప్రతి ఒక్క దేవుడికి ప్రత్యేకంగా ఒక వారం ఉంటుంది. కలియుగ దైవమైన వేంకటేశ్వర స్వామికి స్థిరవారం ఇష్టమైన రోజట. కలియుగంలో వేంకటేశ్వరుడు ఎర్రచందన రూపుడిగా ఆంధ్రప్రదేశ్‌లో కోనసీమ జిల్లాలోని వాడపల్లిలో దర్శనమిస్తున్నాడు. ఇక్కడి స్వామివారిని స్థిరవారం దర్శించుకోవాలంటే పెట్టి పుట్టాలట. స్వామివారు పచ్చని కోనసీమ అందాల నడుమ 800 ఏళ్ల కిందట 1300 కి.మీ పాటు గోదావరిలో కొట్టుకొచ్చి వాడపల్లిలో వెలిశారు.ఇక్కడి స్వామి వారిని దర్శించుకునేందుకు ఇతర దేశాల నుంచి సైతం భక్తులు వస్తుంటారు. తిరుమల క్షేత్రం తర్వాత అంతటి వైభవం వాడపల్లి వేంకటేశ్వరస్వామికే ఉందంటారు.

ఇవాళ శనివారం కావడంతో వాడపల్లికి భక్తులు పోటెత్తారు. ఉదయమే స్వామివారిని అర్చకులు ప్రత్యేకమైన పువ్వులతో అలంకరిచడంతో పూర్ణాలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. గౌతమీ గోదావరిలో స్నానాలు ఆచరించి భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామివారి దర్శనానికి సాధారణ భక్తులతో పాటు ఏడు వారాల నోము ఆచరిస్తున్న భక్తులు సైతం తరలి రావడంతో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో నిండిపోయింది. ఇంతటి ఎండలో సైతం మాడ వీధుల్లో భక్తులు ఏడు ప్రదక్షిణలు చేసి ఏడు వారాల పాటు స్వామివారిని దర్శించుకుంటున్నారు.

Share this post with your friends