దత్తాత్రేయుని పూజ ఎలా నిర్వహించాలి?

గురు గ్రహ అనుగ్రహం కోసం దత్తాత్రేయుడిని గురువారం పూజించాలి. మరి ఆ పూజ ఎలా చేస్తే సత్ఫలితాన్ని ఇస్తుందో తెలుసుకుందాం. గురు గ్రహ అనుగ్రహం పొందడానికి గురువారం రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి శుచిగా స్నానమాచరించాలి. అనంతరం పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని ఆపై దత్తాత్రేయ స్వామి విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ ప్రతిష్టించుకోవాలి. అనంతరం ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి అందులో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయాల్సి ఉంటుంది. దత్తాత్రేయుని చిత్ర పటం కాకుండా విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉంటే.. పంచామృతాలతో అభిషేకం చేయాలి.

దత్తాత్రేయుని పూజ ఎలా నిర్వహించాలి?
దత్తాత్రేయుని పూజ ఎలా నిర్వహించాలి?

అనంతరం గురువుకు ప్రీతికరమైన పసుపు రంగు పూలతో దత్తాత్రేయ స్వామిని అలంకరించాలి. ఇక ఇప్పుడు పూజ ప్రారంభమవుతుంది. స్వామివారిని అక్షింతలు, పువ్వులతో అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. అనంతరం స్వామివారికి నైవేద్యాన్ని సైతం పసుపు రంగులో ఉండే వాటినే నివేదించాలి. పసుపు రంగులో ఉండే అరటిపండ్లు, పులిహోర, లడ్డూల వంటి ప్రసాదాలను సమర్పించాలి. పూజ పూర్తయ్యాక శ్రీ దత్తస్తవం, దత్తాత్రేయ కవచం, గురుచరిత్ర పారాయణ చేసి కర్పూర నీరాజనం ఇచ్చి నమస్కరించుకోవాలి. పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉండాలి. అనంతరం పూజలో దత్తాత్రేయ తిలకాన్ని తయారు చేయాలి.

Share this post with your friends