సనాతన గడియారం గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది? చాలా సుందరంగా.. ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సనాతన గడియారంలో 12:00 గంటల స్థానంలో “ఆదిత్య” అని రాసి ఉంటుంది. దీని అర్థం సూర్యుడు 12 రూపాల్లో ఉంటాడు. ఆ 12 ఆదిత్యులు 12 మాసాలకు ప్రతీకలు:
– ధాటృ (చైత్ర మాసం)
– మిత్రుడు (వైశాఖ మాసం)
– అర్యమా (జ్యేష్ఠ మాసం)
– శక్ర (ఆషాఢ మాసం)
– వరుణ (శ్రావణ మాసం)
– అంశుమాన్ (భాద్రపద మాసం)
– భగ (ఆశ్వయుజ మాసం)
– వివస్వాన్ (కార్తీక మాసం)
– పూష (మార్గశిర మాసం)
– సవితృ (పుష్య మాసం)
– త్వష్ట (మాఘ మాసం)
– విష్ణువు (ఫాల్గుణ మాసం)

1:00 గంటల స్థానంలో ఈశ్వరుడు అని రాసి ఉంటుంది. దీని అర్థం ఈశ్వరుడు ఒకే రకం ఉంటాడు. ఏకో బ్రహ్మ ద్వితీయో నాస్తి అని అంటారు కదా.
2:00 గంటల స్థానంలో పక్షం అని రాసి ఉంటుంది. దీని తాత్పర్యం పక్షాలు రెండు ఉంటాయి అవి.. 1.కృష్ణపక్షం 2.శుక్లపక్షం.
3:00 గంటల స్థానంలో అనాది తత్వం అని రాసి ఉంటుంది. దీని తాత్పర్యం అనాది తత్వాలు మూడు ఉన్నాయి. పరమాత్మ, జీవాత్మ, ప్రకృతి – ఇవి మూడు తత్వాలు అనాది.
