How to offer bilva leaves on Shivling : శివుడిని బిల్వ పత్రాలతో అర్చిస్తే…. శని దోషాలు తొలగిపోతాయా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి

భోళాశంకరుడిని భక్తసులభుడు అని ఎందుకు అంటారో …
బిల్వపత్రార్చన రహస్యం చెబుతుంది. శివ మహాపురాణం ప్రకారం బిల్వ వృక్షం సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమేనని తెలుస్తుంది. ఒకసారి శనిదేవుని ధర్మనిష్ఠను పరీక్షించాలనుకున్న శివుడు. శనీశ్వరుడికి కనిపించకుండా బిల్వ వృక్ష రూపంలో ఉన్నాడని పురాణాల ద్వారా చెబుతుంది. రోజంతా శివుని కోసం పార్వతీ దేవి వెతికినా పరమేశ్వరుడి ఆచూకీ తెలియలేదు. సంధ్యాసమయంలో బిల్వ వృక్షం నుంచి శివుడితో పాటు శనిదేవుడు కూడా ప్రత్యక్షమయ్యారు. శని దేవుడి కర్తవ్య నిర్వహణకు మెచ్చిన శివుడు శని దేవుడు శనీశ్వరుడిగా పిలవబడతాడని వరం ఇచ్చి, “తనను భక్తులు బిల్వపత్రాలతో ఆరాధిస్తే శనిదోషాలు వారిని తాకవు” అని వరం ఇచ్చాడు. అప్పటి నుంచి బిల్వ పత్రాలతో శివుడిని అర్చిస్తే శని దోషాలు తొలగుతాయని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. శివుని శరణు వేడితే కష్టం కూడా కృపగా మారుతుందనే విశ్వాసమే ఈ పూజ సారం.

How to offer bilva leaves on Shivling
How to offer bilva leaves on Shivling
Share this post with your friends