ఆంజనేయస్వామికి తమలపాకుల దండ వేస్తే అత్యంత సంతోషిస్తాడట. ఆయనకు తమలపాకులంటే చాలా ఇష్టమంట. అందుకే భక్తులు ఆంజనేయస్వామికి ముఖ్యంగా తమలపాకుల దండ తీసుకెళుతూ ఉంటారు. అయితే ఆయనకు తమలాపాకులంటే ఎందుకు అంత ఇష్టమనేది మాత్రం ఆలోచించరు. అంజనీ పుత్రుడికి తమలపాకులు అంత ప్రీతిపాత్రంగా ఎందుకు మారాయో చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. హనుమంతుడు సీతమ్మ కోసం లంకకు వెళతాడు. అప్పుడు ఆయన తోకకు రావణ సైన్యం నిప్పంటిస్తుంది. దీంతో ఆగ్రహించిన హనుమంతుడు లంకంతా తగులబెడతాడు.
లంకా దహనం అయ్యాక హనుమంతుని శరీరానికి బాగా గాయాలవుతాయి. అప్పుడు శ్రీరామచంద్రుడు తమలపాకులను హనుమంతుడికి ఎక్కడైతే పక్కన కుర్చోబెట్టుకొని ఆ గాయాలపై తమలపాకును ఉంచాడట. అప్పుడు హనుమంతుడికి గాయాల బాధ నుంచి ఉపశమనం కలిగిందట. అప్పటి నుంచి హనుమంతునికి తమలపాకు మీద ఇష్టం ఏర్పడిందట. ముఖ్యంగా మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని పూజించి 5 తమలపాకులు, మాల వేస్తే చాలా ఆయన చాలా సంతుష్టుడవుతాడట. దీంతో మనం కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా.. మన సమస్యలన్నీ తొలిగిపోతాయని అంటారు.