
భీష్మాష్టమి నుంచి భీష్మద్వాదశి వరకు ఉన్న ఐదు రోజులను భీష్మ పంచకం అంటారు. ఈ ఐదు రోజులు భీష్ముని జీవితం నుంచి ప్రేరణ పొందేందుకు కేటాయించబడ్డాయి.
ప్రత్యేకంగా భీష్మ ఏకాదశి (జయ ఏకాదశి) నాడు ఏమేం చేస్తారంటే..
ఉపవాసం
విష్ణు సహస్రనామ జపం
భగవద్గీత పఠనం
చేస్తే వ్యక్తిత్వం సాత్వికంగా మారుతుందని శాస్త్రవచనం.
భీష్ముడు భారతీయులందరికీ పూర్వీకుడే. ఆచార్యుడు, ధర్మజ్ఞుడు, మహాభక్తుడు. ఈ రోజు ఆయనను స్మరించి తర్పణం ఇచ్చినవారి పాపాలు దహించిపోతాయని పెద్దల విశ్వాసం. భీష్మాష్టమి అనేది మనలోని ధర్మాన్ని మేల్కొలిపే మహాపర్వంగా పేర్కొంటారు.
