కార్తీక మాసంలో శివదీపాలు వెలిగించాల్సిన విధానమేంటంటే..

కార్తీక మాసం చాలా పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. ఈ మాసం శివకేశవులిద్దరికీ పరమ పవిత్రమైన మాసంగా పేర్కొంటారు. హిందూ సంప్రదాయంలో ఈ నెలను ఆధ్యాత్మిక సాధనకు, మోక్షసాధనకు విశిష్టమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా ఈ మాసంలో ఉపవాసం, దీపారాధన, దీప దానం వంటి వాటికి అత్యదిక ప్రాధాన్యమిస్తారు. ఈ మాసంలో శివాలయం, విష్ణు ఆలయాల్లో దీపాలను వెలిగిస్తూ ఉంటారు. కార్తీక మాసంలో కొన్ని నియమాలు పాటిస్తూ దీపాలు వెలిగించడం వలన దైవానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని నమ్మకం.

శివాలయం, విష్ణు ఆలయాల్లో దీపాలు వెలిగించే పద్ధతి వేరుగా ఉంటుంది. ఈ కార్తీక మాసంలో శివాలయాల్లో చాలా మంది సాయంత్రం వేళల్లో దీపాలు వెలిగిస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించేటప్పుడు మూడు చోట్ల తప్పకుండా దీపాలు వెలిగించాలి. ఆ మూడు ప్రదేశాలేంటంటే.. మొట్టమొదట ఆలయానికి వెళ్లగానే గోపురం కనిపిస్తుంది. ఆలయ గోపురం వద్ద మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించాలి. ఆ తర్వాత నందీశ్వరుడి దగ్గర దీపం వెలిగించాలి. ఆ తర్వాత మూడవ ప్రదేశం గర్భగుడిలో ఈశ్వరుడికి వీలైనంత సమీపంలో దీపం వెలిగించాలి. ఇలా చేస్తే ఫలితం చాలా బాగుంటుందని చెబుతారు.

Share this post with your friends