వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు..

దేశ వ్యాప్తంగా గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. గురు పౌర్ణమి సందర్భంగా నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని బిజ్వారం అంబత్రయ క్షేత్రంలో ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున వేడుకలకు హాజరైన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే శ్రీ షిర్డి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ నకిరేకల్ వారి ఆధ్వర్యంలో గురు పౌర్ణ‌మి వేడుక‌ల‌ను గురువారం ఘ‌నంగా నిర్వ‌హించారు. తెల్లవారుజామున 5 గంటల నుంచే పలు కార్యక్రమాలను నిర్వహించారు.

ఉదయం 5-15 గంట‌ల‌కు కాగడ హారతి, ఆ తరువాత 108 కలశాలతో పంచామృత అభిషేకములు, అలంకరణ, అష్టోత్తర శతనామావళి, హారతి, దర్శనములు, 9-30 గంట‌ల‌కు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు, మధ్యాహ్నాం 12-30 గంట‌ల‌కు మధ్యాహ్నా హారతి, నైవేద్యం, ఆపై అన్నదాన కార్యక్రమం నిర్వమించారు. ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఆధ్వర్యంలో గురు పూర్ణిమ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలు ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ (గురువారం) రాత్రి ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలను లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనున్నారు. ఇవాళ రాత్రి నుంచి వాటిని లైవ్‌లో తిలకించవచ్చు.

Share this post with your friends