నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో వైభవంగా ప్రారంభమైన ఉగాది మహోత్సవాలు. నేటి నుండి క్షేత్రంలో ఐదు రోజులపాటు ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. శ్రీ స్వామివారి యగశాల ప్రవేశంతో ఉగాది ఉత్సాహలకు శ్రీకారం చుట్టిన అర్చకులు, ఈవో పెద్దిరాజు దంపతులు. సాయంత్రం మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్న శ్రీ భ్రమరాంబిక అమ్మవారు. భృంగి వాహనంపై శ్రీశైలం ఆదిదంపతులకి క్షేత్ర పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించబడుతుంది.
2024-04-06