దేవుళ్లందరూ ఒక ఎత్తు.. శ్రీరాముడు మరో ఎత్తు. ఆయన నిత్యం సత్యాన్నే అంటిపెట్టుకుని ఉంటాడు. ధర్మాన్ని నమ్ముకుని పాలన సాగించాడు. అందుకే ఆయనను ప్రతి ఒక్క విషయంలోనూ భారత ప్రజానీకం ఆదర్శంగా తీసుకుంటూ ఉంటుంది. భక్తి శ్రద్ధలతో ఆయనను పూజిస్తూ ఉంటుంది. ఇక సీతారాముల కల్యాణాన్ని లోక కల్యాణంగా భావిస్తూ ఉంటారు. ఇక శ్రీరామనవమిని ఈ ఏడాది చైత్ర మాసం నవమి నాడు జరుపుకోనున్నారు. ఏప్రిల్ 16నే మధ్యాహ్నం 1.23 గంటల నుంచి తిథి ప్రారంభం ప్రారంభం కానుంది. ఏప్రిల్ 17న మధ్యాహ్నం 3.14 గంటలకు ముగియనుంది కాబట్టి శ్రీరామనవమిని 17న జరుపుకుంటున్నాం.
శ్రీరామనవమి పండుగ ఇంత వైభవంగా నిర్వహించుకోవడం వెనుక శాస్త్రీయ కారణాలు కొన్ని ఉన్నాయి. శ్రీరామనవమి వెనుకరామ నామాన్ని ఒక్కసారి ఉచ్ఛరించిన ముక్కోటి దేవుళ్లను వెయ్యిసార్లు స్మరించిన ఫలితం దక్కుతుందని శివుడు చెప్పినట్టు ప్రతీతి. ఇక ఈ పండుగ ఎండాకాలంలో వస్తుంది. ఆ సమయంలో అధిక ఉష్ణోగ్రత.. ఆ కారణంగా నీటి కొరత వంటి సమస్యలు జనాలను ఇబ్బంది పెడుతుంటాయి. ఈ తరుణంలో రామనామాన్ని జంపించడం వల్ల ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. కొందరు భక్తులు ఈ రోజున ఉపవాసం కూడా ఉంటారు. ఇది మున్ముందు ఏదైనా కరువు వచ్చినా కూడా తట్టుకునేందుకు సహాయపడుతుందట. అంతేకాకుండా ఉపవాసమనేది రోగనిరోధక శక్తిని మరింత మెరుగుస్తుంది.