శుక్ల పక్షం ఏకాదశి తిథిని ఉత్థాన ఏకాదశి తిథి అంటామని.. దాని గురించి తెలుసుకున్నాం. ఈ రోజున విష్ణుమూర్తి నాలుగు నెలల యోగ నిద్ర నుంచి మేల్చొంటామని కూడా తెలుసుకున్నాం. ఈ రోజు విష్ణుమూర్తిని పూజించుకుని ఉపవాసం ఉంటే చాలా మంచిదట. అసలు ఈ రోజున ఏం చేయాలో తెలుసుకుందాం. బ్రహ్మ ముహూర్తానే నిద్ర లేచి స్నానపు నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానమాచరించి పసుపు దుస్తులు ధరించాలి. అనంతరం విష్ణుమూర్తి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలి. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం ఆ వ్యక్తిపై ఉంటుందని నమ్ముతారు.
ఉత్థాన ఏకాదశి నాడు శ్రీ మహా విష్ణువుకు కుంకుమ పువ్వు పాలతో అభిషేకం నిర్వహించాలి. ఇలా చేస్తే మనిషి జీవితంలోని సమస్యలు తొలగిపోతాయి. వివాహానికి సంబంధించిన సమస్యలున్నవారు శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి కుంకుమ, చందన తిలకం దిద్ది.. ఆపై పసుపు పుష్పాలతో పూజించుకుంటే త్వరగా వివాహం జరుగుతుందట. ఈ రోజున రావి చెట్టుకు నీరు సమర్పించి సాయంకాలం వేళ రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే అప్పుల బాధ నుంచి గట్టెక్కుతారట. అలాగే ఈ రోజున తులసి పూజ చాలా మంచిదట. తులసి మొక్కకు చెరుకు రసాన్ని నేవైద్యంగా సమర్పించి నెయ్యి దీపం వెలిగించాలి. అనంతరం తులశమ్మకు హారతి ఇస్తే ఆర్థిక కష్టాలన్నీ పోయి ఐశ్వర్యవంతులవుతారట.