సంకష్టహర చతుర్థికి వైభవంగా వేడుకలు.. విఘ్నేశ్వరునికి విశేషపూజలు, అభిషేకాలు

వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సంకటహర చతుర్థి గణపతి వ్రతం
కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సంకష్టహర చతుర్థి గణపతి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు సిద్ధి, బుద్ధి, సమేత వినాయకస్వామివార్ల ఉత్సవమూర్తులను కల్యాణ వేదిక వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో సంకటహర చతుర్థి గణపతి వ్రతం నిర్వహించారు.

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో గణపతి అభిషేకం
విజయవాడ ఇంద్రకీలాద్రిలోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో గణపతి అభిషేకం ఘనంగా జరిగింది. సంకష్టహర చతుర్థి సందర్బంగా స్వామివారికి పూజలు, గణపతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వైదిక సిబ్బంది, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

గణనాథుని సన్నిధిలో సంకష్టహర చతుర్థి వేడుకలు
ధర్మపురిలో గణనాథుని సన్నిధిలో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి అనుబంధ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో గణపతికి ఉపనిషత్తులతో అభిషేకం, హారతి మంత్రపుష్పం పూజాదికాలను నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీ సంపత్ వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలు
విశాఖలోని శ్రీ సంపత్ వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్ది వేడుకలు ఘనంగా జరిగాయి, అంగారక చతుర్ధి సందర్భంగా గణపతికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని గరికతో అర్చించారు. ఈరోజున వినాయకుడిని భక్తిశ్రద్దలతో పూజిస్తే కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.

చింతామణి ఆలయంలో విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు
సంకష్టహర చతుర్ధి సందర్భంగా విశాఖ చింతామణి ఆలయంలో విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి అర్చనలు, హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వినాయకునిణ్ణి పూజించడం వల్ల బాధలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.

సంకష్టహర చతుర్థి సందర్భంగా క్షీరాభిషేకం
కాజీపేటలోని శ్రీ శ్వేతార్కమూల గణపతి దివ్యక్షేత్రంలో స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. సంకష్టహర చతుర్థి సందర్బంగా సప్త వర్ణాభిషేకం నిర్వహించారు. స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. దూర్వా హోమం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను ఘనంగా ఊరేగించారు. సాయంత్రం నిర్వహించిన వసంతోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది.

హైదరాబాద్ నల్లకుంట శంకరమఠంలో సంకష్టహర చతుర్థి వేడుక
హైదరాబాద్ నల్లకుంట శంకరమఠంలో సంకష్టహర చతుర్థి వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు అర్చనలు, హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

సంకట హరచతుర్థి సందర్భంగా పంచామృతాలతో అభిషేకం
సంకట హరచతుర్థి సందర్భంగా సికింద్రాబాద్‌ గణపతి ఆలయంలో విశేష పూజలు చేశారు. పంచామృతాలతో అభిషేకించారు. పరిసర ప్రాంతాల ప్రజలు స్వామివారిని దర్శించుకున్నారు.

విజయ గణపతి ఆలయంలో విశేష పూజలు, అభిషేకాలు
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని విజయ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్ధి వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విఘ్నేశ్వరునికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

నిజాంపేటలోని శ్రీ గణపతి ఆలయంలో విశేష పూజలు
హైదరాబాద్‌ నిజాంపేటలోని శ్రీ గణపతి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారిని పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు.

Share this post with your friends