తిరుమలలో వ్యూహలక్ష్మికి ప్రతి శుక్రవారం ఏం చేస్తారంటే..

వ్యూహ లక్ష్మినే స్వర్ణ లక్ష్మి అని కూడా పిలుస్తారు. తిరుమలలో గర్భాలయంలో శ్రీవారి వక్షస్థలంపై కొలువుదీరిన వ్యూహలక్ష్మి కోసం ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అవేంటో తెలుసుకుందాం. వ్యూహలక్ష్మికి ప్రతి శుక్రవారం నాడు పసుపుతో అభిషేకించి అనంతరం అమ్మవారిని అలంకరిస్తారు. అభిషేకం పూర్తైన మీదట స్వామివారిని కూడా పచ్చకర్పూరంతో అలంకరించి స్వర్ణాభరణాలు.. పుష్పమాలతో అందంగా అలంకరిస్తారు. ఇదంతా చేసిన మీదటే.. భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఈ వ్యూహలక్ష్మిని దర్శించుకొనే భక్తులకు కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయట.

మాంగల్యంతో దర్శనమిచ్చే మహాలక్ష్మి అమ్మవారి ప్రతిమకు కూడా శుక్రవారం నాడు స్వామివారి ఏకాంతంగా శ్రీసూక్తంతో సుగంధ ద్రవ్యంతో, చందనంతో అభిషేకిస్తారు. అనంతరం నూతన వస్త్రాలను ధరింపజేస్తారు. స్వామివారికి, మహాలక్ష్మికి ప్రత్యేక ఆరాధనల తరువాత కర్పూర హారతి ఇస్తారు. వ్యూహ లక్ష్మి అమ్మవారి గురించి తెలిసింది కదా. ఇక మీదట తిరుమలకు వెళితే తప్పనిసరిగా శ్రీవారి వక్షస్థలంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న వ్యూహలక్ష్మిని దర్శించుకోండి. శ్రీవారి ఆలయంలో విశేషమైన సేవలు, ప్రత్యేక సేవలు జరిపించుకున్న సందర్భాలలో ఈ వ్యూహ లక్ష్మీకి అలంకరించిన పసుపును భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. ఆ పసుపు నుదుట ధరించడంతో పాటు ఇంట్లో ధన స్థానంలో ఉంచుకుంటే సిరి సంపదలు వృద్ధి చెందుతాయి.

Share this post with your friends