తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేద అధ్యయన సంస్థ ఆధ్వర్యంలో ఆక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు తిరుమలలోని నాద నీరాజనం వేదికపై ప్రముఖ పండితులతో శ్రీ శ్రీనివాస వేద విద్వత్ సదస్సు నిర్వహించనున్నారు. ప్రతి రోజు ఉదయం ఉదయం 5 నుడి 6.30 గంటల వరకు చతుర్వేద పారాయణం, దేశంలోని ప్రముఖు పీఠాధిపతులు, మఠాధిపతులు, వేద పండితులతో వేద విజ్ఞానంపై సదస్సు నిర్వహించనున్నారు. ఇందులో వేదాలలోని ఆధునిక విజ్ఞానం, వేదాల్లోని సనాతన ధర్మం, వేదాల్లోని పురుషార్థలు, సమాజానికి అవసరమైన వేదభాష్యం, వేదాలలో భగవత్ తత్వం, వేదం – వేదాంగాలు, వేదం – ఉపనిషత్తుల సందేశం, తదితర అంశాలపై ఉపన్యాసించనున్నారు.
ఇక ఇవాళ తిరుమలలో భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శన భాగ్యాన్ని భక్తులకు టీటీడీ కల్పిస్తోంది. ఇక నిన్న తిముల శ్రీ మలయప్ప స్వామివారిని 62,380 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 21,405 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమలేశుని హుండీ ఆదాయం నిన్న రూ.3.95 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది.