గీతా మహత్స్యాన్ని శివుడు ఎవరికి చెప్పాడంటే..

గీతోపనిషత్తుగా ప్రసిధ్దికెక్కిన భగవద్గీతకు 18 పేర్లున్నాయి.

అవి వరుసగా: 1. గీత 2. గంగ 3. గాయత్రి 4. సీత 5. సత్య 6. సరస్వతి 7. బ్రహ్మవిద్య 8. బ్రహ్మవల్లి 9. త్రిసంధ్య 10. ముక్తిగేహిని 11. అర్ధమాత్ర 12. చిదానంద 13. బవఘ్ని 14. భ్రాన్తినాశని 15. వేదత్రయి 16. పర 17. అనంత 18. తత్యార్ధజ్ఙానమంజరి.

గీతా మహత్స్యాన్ని శివుడు ఎవరికి చెప్పాడంటే..
గీతా మహత్స్యాన్ని శివుడు ఎవరికి చెప్పాడంటే..

మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాగా మహాభారతం భీష్మపర్వంలోని 43వ అధ్యాయం నాలుగవ శ్లోకంలో వేదవ్యాసుడు గీతలో శ్లోకాల సంఖ్య 745గా చెప్పాడు. ఇందులో శ్రీ కృష్ణుడు 574, అర్జునుడు 85, సంజయుడు 41, ధృతరాష్ట్రుడు ఒక శ్లోకం చెప్పారు.

భగవద్గీతలోని 18 అధ్యాయాలు ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క యోగము అంటారు. 1 నుంచి 6 వ అధ్యాయాలను కలిపి ‘కర్మషట్కము’, 7 నుంచి 12 వరకు ‘భక్తి షట్కము’.. 13 నుంచి 18 వరకూ ‘జ్ఞాన షట్కము’ అంటారు. ఈ గీతా మహాత్మ్యాన్ని పార్వతీదేవికి శివుడు చెప్పారు. కాగా, శ్రీ కృష్ణపరమాత్మ గీతాబోధన చేయగా ప్రత్యక్షంగా విన్నవారు అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు ఇంకా రథం (అర్జునుడి రథం) ధ్వజంపై నున్న ఆంజనేయస్వామి.

Share this post with your friends