భ‌క్తుల‌కు టీటీడీ కీలక విజ్ఞ‌ప్తి

ఎలాగైనా సరే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలన్న కోరికతో కొందరు భక్తులు దళారులను ఆశ్రయించి మోసపోతున్నారు. ఆ తరువాత టీటీడీకి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కీలక విజ్ఞ‌ప్తి చేసింది. శ్రీ‌ వేంకటేశ్వర స్వామివారి భ‌క్తులు ద‌ర్శ‌న టికెట్లు, ఆర్జిత‌ సేవా టికెట్లు, వసతి గ‌దుల‌ను బుక్ చేసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్‌ను మాత్ర‌మే వినియోగించాల‌ని టీటీడీ నిఘా మ‌రియు భ‌ద్ర‌తా విభాగం విజ్ఞ‌ప్తి చేస్తోంది. న‌కిలీ వెబ్‌సైట్ల‌ను న‌మ్మి మోస‌పోవ‌ద్ద‌ని స్ప‌ష్టం చేసింది.

న‌కిలీ వెబ్‌సైట్లను సంప్ర‌దించి మోస‌పోయిన‌ట్టు ప‌లువురు భ‌క్తుల నుండి టీటీడీకి పలు ఫిర్యాదులు అందాయి. ఈ మేర‌కు టీటీడీ నిఘా మ‌రియు భ‌ద్ర‌తా విభాగం అధికారులు న‌కిలీ వెబ్‌సైట్ల‌పై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేయడం జరిగింది. తిరుమల తిరుప‌తి దేవ‌స్థాన‌ముల‌కు సంబంధించిన స‌మాచారం కోసం మరియు శ్రీ‌వారి ద‌ర్శ‌న టికెట్లు, ఆర్జిత‌ సేవా టికెట్లు, వసతి గ‌దుల‌ను బుక్ చేసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్‌ https://TTDevasthanam.ap.gov.in మాత్ర‌మే ఉంది. ఈ వెబ్‌సైట్‌కు సంబంధించిన స‌మాచారం, ఇత‌ర వివ‌రాల కోసం తమ కాల్ సెంట‌ర్‌ టోల్‌ ఫ్రీ నెంబర్ 155257 ను సంప్ర‌దించాలని టీటీడీ సూచించింది.

Share this post with your friends