వీఐపీ బ్రేకు దర్శనాల విషయమై టీటీడీ కీలక నిర్ణయం

వేసవి సెలవుల రద్దీ నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. వారికి కావల్సిన అకామిడేషన్, దర్శనం వంటివి చాలా ఇబ్బందికరంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి మారింది. నిత్యం 70 వేలకు పైనే భక్తులు తిరుమలకు వస్తుండటంతో టోకెన్ లేని భక్తులకు దర్శనం దాదాపు 24 గంటలు పడుతోంది. ఇలాంటి తరుణంలో వీఐపీ బ్రేక్ దర్శన్ సౌకర్యం కల్పించడం వలన సాధారణ భక్తులకు మరింత ఇబ్బందికరంగా మారింది. దీంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపి లకు మాత్రమే మే 01 నుంచి జూలై 15 వరకు బ్రేక్ దర్శనాలు పరిమితం చేసింది.

శ్రీ మలయప్ప స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం టీటీడీ మే 01 తారీకు నుండి పలు కీలక నిర్ణయాలు అమలు చేయనుంది. వేసవి సెలవుల నేపథ్యంలో ఇప్పటికే తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించడంలో భాగంగా మే 01 తారీకు నుండి జూలై 15 వ తారీకు వరకు, వీఐపీ బ్రేక్ దర్శనాలు కేవలం స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే టీటీడీ పరిమితం చేయనుంది. అదేవిధంగా మే 01వ తారీకు నుంచి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రయోగాత్మకంగా ఉదయం 6 గంటల నుంచి అమలు చేయనుంది.

Share this post with your friends