టీటీడీ అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ.కోటి విరాళం

చెన్నైకి చెందిన సంసార్ క్యాపిటల్ కంపెనీ ఎండీ & సీఈఓ శ్రీ వెంకటేష్ కన్నపన్ టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ.కోటి టీటీడీ అన్నప్రసాదం ట్రస్ట్ కు శుక్రవారం విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు డొనేషన్ డిడిని శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి దాత అందజేశారు.

తిరుపతిలో జనవరి 8న జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడిన భక్తురాలికి టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, కొంతమంది బోర్డు సభ్యులు పరిహారాన్ని శుక్రవారం అందించారు. కడప జిల్లా వీరపునాయనపల్లి మండలం, సర్వరాజుపేట కాలనీకి చెందిన బాధితురాలు శ్రీమతి జి. శైలజకు రూ.2 లక్షల డిడిని పంపిణీ చేశారు. తిరుమలలోని చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో బాధితురాలికి చైర్మన్ బిఆర్ నాయుడు, బోర్డు సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ, శ్రీ శాంతారాం డిడిని అందజేశారు.

ఇక నేడు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం ఉంది. నిన్న శ్రీ వేంకటేశ్వర స్వామివారిని 51,818 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ 2.52 కోట్లు వచ్చింది.

Share this post with your friends