పీఠాధిప‌తుల‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన టీటీడీ చైర్మ‌న్‌

పాలిమారు మఠం పీఠాధిపతి విద్యాదీశ తీర్థ స్వామిజీ, భీమనకట్టె మఠం పీఠాధిపతి రఘువరేంద్ర తీర్థ స్వామిజీల‌ను తిరుమ‌లలోని వ్యాస‌రాజ మ‌ఠంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మ‌న్ శ్రీ బీ.ఆర్.నాయుడు మంగ‌ళ‌వారం సాయంత్రం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా హిందూ ధ‌ర్మ‌వ్యాప్తికి తిరుమల తిరుపతి దేవస్థానం చేప‌డుతున్న కార్య‌క్ర‌మాలు, ముఖ్య‌మంత్రివ‌ర్యులు గౌ.శ్రీ నారా చంద్ర‌బాబు ఆదేశాల‌తో దేశంలోని అన్ని రాష్ట్రాల రాజ‌ధానుల్లో శ్రీ‌వారి ఆల‌యాల నిర్మాణానికి కృషి చేస్తున్న‌ట్లు చైర్మ‌న్ స్వామీజీల‌కు వివ‌రించారు.

భ‌క్తులు సంతృప్తిగా తిరుమ‌ల యాత్ర‌ను పూర్తి చేసుకునేలా తిరుమల తిరుపతి దేవస్థానం ప‌ని చేయాల‌ని పీఠాధిప‌తులు చైర్మ‌న్ కు సూచించారు. శ్రీ‌ వేంకటేశ్వర స్వామివారి అనుగ్ర‌హంతో టీటీడీ త‌ల‌పెట్టే అన్ని కార్య‌క్ర‌మాలు స‌ఫ‌లీకృతం కావాల‌ని స్వామీజీలు ఆశీస్సులు అంద‌జేశారు. అనంత‌రం చైర్మ‌న్ ను స్వామీజీలు ప‌ట్టు శాలువ‌తో స‌న్మానించి, మ‌హా భార‌తం గ్రంథాన్ని బ‌హుక‌రించి ఆశీర్వ‌దం అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ బోర్డు స‌భ్యులు శ్రీ న‌రేష్ కుమార్ పాల్గొన్నారు.

Share this post with your friends