తిరుమలలో అత్యంత ప్రతిష్టాత్మకమైన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు వారం కంటే తక్కువ సమయం ఉన్నందున, తొమ్మిది రోజుల పాటు ఉత్సవాల ఏర్పాట్లను, టీటీడీలోని అన్ని విభాగాలపై టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కూడి సమీక్షించారు. తిరుమల అన్నమయ్య భవనంలో వార్షిక బ్రహ్మోత్సవాల తుది సమావేశం శుక్రవారం జరిగింది. సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో పాటు జేఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, అన్ని శాఖల ఏర్పాట్లలో ఎలాంటి రాజీ ఉండకూడదని, అన్నప్రసాదం మరియు ఆరోగ్య (పారిశుద్ధ్యం) విభాగాలు రెండు ముఖ్యమైన విభాగాలుగా ఒకదానికొకటి సమన్వయం చేసుకుని దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. “అన్నప్రసాదం వడ్డించడం పూర్తయిన వెంటనే, చెత్తను తొలగించడం మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో ఆలస్యం చేయకుండా ఆరోగ్య శాఖ పారిశుధ్య కార్మికులను ఆదేశించాలని అని ఆయన సూచించారు. అనంతరం ఇంజినీరింగ్ పనులు, శ్రీవారి ఆలయం, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ, గార్డెన్ మరియు ఫారెస్ట్లు, నృత్యం మరియు భజన బృందాలు, రవాణా, గోశాల, మెడికల్ విభాగాలను ఈవో పరిశీలించారు. శ్రీవారి సేవకుల సేవలను ఆయా విభాగాలు సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. ఈ సమావేశంలో డిఎల్ వో శ్రీ వరప్రసాద్, సిఈ శ్రీ సత్యనారాయణ, ఎఫ్ఎసిఎఓ శ్రీ బాలాజీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.