తిరుమలలో వివిధ రకాలైన జంతువులకు కొదవ ఉండదు. నిత్యం ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటాయి. ఆ మధ్య కాలంలో ఎక్కువగా చిరుత పులులు కలకలం రేపాయి. ఇక తాజాగా తిరుమలలో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. గురువారం స్థానిక శ్రీవారి సేవా సదన్-2 సమీపంలోని ఉద్యానవనంలోకి శ్రీ వేంకటేశ్వర స్వామివారి సేవకులు గుర్తించారు. 10 అడుగుల కొండచిలువ ప్రవేశించింది. సేవకులు గుర్తించి తితిదే అటవీ శాఖకు సమాచారం అందించడంతో పాములు పట్టడంలో నేర్పరి అయిన భాస్కర్‌నాయుడు వచ్చి దాన్ని చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం అవ్వాచ్చారి కోనలో విడిచిపెట్టారు.
గత రెండు రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. దీంతో శ్రీవారి దర్శనానికి నేరుగానే భక్తులను అనుమతించారు. తిరుమలలో నేడు టోకెన్ లేని భక్తులకు శ్రీ మలయప్ప స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 9 కంపార్టుమెంట్లలో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 63,544 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 22,942 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.37 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.