
ప్రతి నెలలో ఒకరోజు స్థానిక భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ మలయప్ప స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నెలకు సంబంధించిన టికెట్ల జారీ తేదీని టీటీడీ ప్రకటించింది. ఫిబ్రవరి 11న స్థానికులకు శ్రీవారి దర్శనం కోసం ఫిబ్రవరి 9న తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో, తిరుమలలోని బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో దర్శన టోకెన్లు జారీ చేస్తారు. ఫిబ్రవరి 4న రథసప్తమిని దృష్టిలో ఉంచుకుని టీటీడీ స్థానికుల దర్శనాన్ని నెలలో మొదటి మంగళవారం నుంచి ఫిబ్రవరి నెలలో రెండో మంగళవారానికి వారానికి మార్చిన విషయం తెలిసిందే.
తిరుమలలో అదన ఈవో ఆకస్మిక తనిఖీలు
తిరుమలలో టీటీడీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ పరిస్థితులను పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి శనివారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా లడ్డూ కౌంటర్లు, అగర్బత్తీల స్టాల్స్‌ను సందర్శించి విక్రయాలను పరిశీలించారు. అనంతరం బూందీ పోటును పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.
