బ్రహ్మోత్సవాల్లో అన్నప్రసాదంపై టీటీడీ ప్రత్యేక చర్యలు..

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవకు అత్యంత ప్రాధాన్యముంది. దీనికి భక్తులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. దీనికోసం భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లను నిర్వహించింది. అక్టోబరు 8న జరిగే గరుడసేవకు పెద్ద ఎత్తున భక్తులు హాజరుకానున్నారు. ఆ రోజున ప్రత్యేక దృష్టి సారించి తదుపరి వార్షిక బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లపై మంగళవారం సాయంత్రం టీటీడీ అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు.

గోకులం విశ్రాంతి భవనంలో ఈ సమావేశం జరిగింది. అందులో భాగంగా వాహనముల ముందు ప్రదర్శించే వివిధ రాష్ట్రాలకు చెందిన సాంస్కృతిక బృందాలను అడిషనల్ ఈఓ పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.తర్వాత అన్నప్రసాదం విభాగం రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను కూడా అధ్యయనం చేశారు. ఇందులో ఆహార తయారీ, పంపిణీ మార్గ ప్రణాళిక, ఇతర విభాగాలతో సమన్వయంతో అన్నప్రసాదాన్ని గ్యాలరీలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ చేసేలా చూసుకున్నారు.

Share this post with your friends