టీటీడీ నూతన చీఫ్‌ విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా శ్రీధర్‌ బాధ్యతలు..

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో టీటీడీ నూతన చీఫ్‌ విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా శ్రీ ఎస్‌ శ్రీధర్‌ ఐపిఎస్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తరువాత శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం కొత్త సివి అండ్ ఎస్ఓకు రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేశారు. అధికారులు శ్రీవారి ఫోటోతో పాటు తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీలోని విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.

తిరుమలకు వెళ్లే భక్తులకు గమనిక..

తిరుమలకు దాదాపు రైలు మార్గంలోనే ఎక్కువ మంది వెలుతుంటారు. అయితే తిరుమల వెళ్లే ట్రైన్ విషయంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రైలును ఈ నెల 11 వరకు రద్దు చేసింది. విశాఖ-కడప మధ్య నడిచే రైలు (17488 )ను ఈ నెల 5 నుంచి 10 తేదీ వరకూ రద్దు చేసింది. అలాగే తిరుగు ప్రయాణంలో కడప నుంచి విశాఖ రైలు (17487) ఈ నెల 6 నుంచి 11వ తేదీ వరకు రద్దు చేసింది. విజయవాడ సమీపంలో నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ పనుల కారణంగా రైల్వే శాఖ ఈ రైళ్ల రద్దు నిర్ణయం తీసుకుంది.

Share this post with your friends