వివాహంలో మూడు ముళ్లు ఎందుకు వేస్తారు?

హిందూ సంప్రదాయంలో ఐదు రోజుల పాటు అప్పట్లో వివాహాలు జరిపించేవారు. ఆ తరువాత అది మారిపోయింది. మూడు రోజుల పాటు జరిపించేవారు. అది కూడా మారిపోయి.. ఒక్కరోజుకు పరిమితమైంది. తిరిగి ఇప్పుడు మళ్లీ ఐదు రోజుల పాటు వివాహ తంతును నిర్వహిస్తున్నారు. ఇక హిందూ వివాహ సంప్రదాయంలో జీలకర్ర బెల్లం పెడితే సగం వివాహం అయిపోయినట్టే ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం పెట్టించాలని భావిస్తూ ఉంటారు. ఇక తాళి కడితే పూర్తిగా పెళ్లి అయిపోయినట్టే. అయితే వధువు మెడలో వరుడు మూడు ముళ్లు వేస్తారు. ఇలా మూడు ముళ్లు వేస్తేనే వివాహం పూర్తయినట్టు.

వివాహంలో మూడు ముళ్లు ఎందుకు వేస్తారు?
వివాహంలో మూడు ముళ్లు ఎందుకు వేస్తారు?

అసలు ఈ మూడు ముళ్లు వేయడమెందుకు? అనేది తెలుసుకుందాం. మూడు ముళ్లు వేయడానికి చాలా కారణాలు ఉన్నాయని చెబుతారు. వాటిలో ఒకదాని గురించి ముందుగా తెలుసుకుందాం. హిందూ సంప్రదాయంలో మూడు అనే సంఖ్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా త్రిమూర్తులు, త్రిలోకాలు, త్రిగుణాలు ఇలా అన్నీ ముఖ్యమైనవి మూడు ఉంటాయి. ఇది మాత్రమే కాదు. మరో ఆసక్తికర విషయం కూడా ఉంది. మనిషికి శరీరాలు సైతం మూడు ఉంటాయని చెబుతారు. ఆ మూడు శరీరాలు కలిసి ఉండాలనే కారణంతోనే మూడు ముళ్లు వేస్తారని శాస్త్ర వచనం.

Share this post with your friends