తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 4న మంగళవారం రథసప్తమి సందర్భంగా ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహనసేవలు ప్రారంభమవుతాయి. అప్పటి నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అమ్మవారు హంస, అశ్వ, గరుడ, చిన్నశేష వాహనాలపై ఊరేగనున్నారు. సాయంత్రం 3.30 నుండి 4.30 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 6 – 7 గం.ల మధ్య చంద్రప్రభ వాహనం, రాత్రి 8.30 – 9.30 గంటల వరకు గజ వాహనాలను అధిష్టించి అమ్మవారు దర్శనమిస్తారు.
రథసప్తమి కారణంగా ఫిబ్రవరి 4న ఆలయంలో శ్రీ అమ్మవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత కల్యాణోత్సవం, కుంకుమార్చన, ఊంజల్ సేవ, వేదాశీర్వచనం సేవలతోపాటు బ్రేక్ దర్శనాన్ని రద్దు చేయడమైనది.
శ్రీ సూర్యనారాయణస్వామి వారి ఆలయంలో
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6 నుండి 7 గంటల వరకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు.