లడ్డు ప్రసాదానికి సంబంధించిన ల్యాబ్ రిపోర్టుల్లో ఏముందో చెప్పిన రమణ దీక్షితులు

కలియుగ ప్రత్యక్ష దైవం, ఆపద మొక్కుల వాడు, అనాథ రక్షకుడు అయిన శ్రీనివాసుడిని దివ్య ధామమైన తిరుమలను హిందువులంతా అత్యంత పవిత్రంగా చూస్తుంటారు. అక్కడి నుంచి మనం ఉండే ప్రతి క్షణం వైకుంఠంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి ప్రసాదం ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనది.. రుచికరమైనదిగా చూస్తాం. అలాంటి లడ్డు ప్రసాదం తాజాగా రాజకీయ రంగు పులుముకుంది. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గత పాలకుల హయాంలో లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యి పూర్తి కల్తీ అని జంతు వ్యర్థాల నుంచి తయారు చేసిందని చెప్పడంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధానార్చకులుగా గతంలో పనిచేసిన రమణదీక్షితులు స్పందించారు.

శ్రీ మలయప్ప స్వామివారి లడ్డు ప్రసాదంలో వినియోగించిన నెయ్యి కల్తీ అంటూ వస్తున్న వార్తలపై కన్నీరు పెట్టారు. సాక్షాత్తు శ్రీవారి సన్నిధిలో అలా జరగడం తనకు తీవ్ర మనోవేదన కలిగించిందన్నారు. ప్రధాన అర్చకుడిగా, ఆగమ సలహాదారుగా.. స్వామివారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడడం తన బాధ్యతని రమణ దీక్షితులు తెలిపారు. ఎప్పటి నుంచో ప్రసాదంలో నాణ్యతపై ఆరోపణలు వచ్చాయని.. ఈ విషయమై తాను కూడా ఎన్నోసార్లు టీటీడీకి ఫిర్యాదు చేశానన్నారు. కానీ తన ఫిర్యాదును టీటీడీ పట్టించుకోలేదు సరికదా.. తనతో కలిసి పోరాటానికి ఎవరూ ముందుకు రాలేదన్నారు. ఈ ఐదేళ్లు నిరాటంకంగా మహాపాపం జరిగిందని పేర్కొన్నారు. తాను లడ్డుప్రసాదంపై పలుమార్లు ల్యాబ్‌ రిపోర్టులు చూశానని .. దానిలో లడ్డులో జంతు కొవ్వు ఉన్నట్లు తెలిసి ఎంతో ఆవేదనకు గురయ్యానని రమణ దీక్షితులు వెల్లడించారు.

Share this post with your friends