తిరుమలలో శ్రీవాణి భక్తులకు శాశ్వత టికెట్ల జారీ కేంద్రం ఏర్పాటుకు టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి సోమవారం జేఈవో శ్రీ వీరబ్రహ్మంతో కలిసి పలు ప్రాంతాలలో స్థలాన్ని పరిశీలించారు.
శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు మరింత సౌకర్యవంతంగా టికెట్లు జారీ చేసేందుకు, గోకులం వెనుక వైపు ఉన్న ఖాళీ స్థలం, ఆదిశేషు విశ్రాంతి గృహం ప్రక్కన వున్న టీటీడీ కల్యాణ మండపం ప్రాంతం, తిరుమల డిఎఫ్ఓ కార్యాలయం పరిశీలించారు. అనంతరం ఇటీవల ఆధునీకరించిన అన్నమయ్య భవనంలోని సమావేశ మందిరంను పరిశీలించారు.
అదనపు ఈవో వెంట ఎస్‌ఈ 2 శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, డిప్యూటీ ఈవో శ్రీ సెల్వం, ట్రాన్స్‌పోర్ట్ జీఎం శ్రీ శేషారెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.