ఆ రోజున శ్రీవారి పలు సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు

ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమికి తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించిన వివరాలన్నింటినీ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వివరించారు. రథసప్తమికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు. రథసప్తమి నాడు పలు సేవలతో పాటు ప్రివిలేజ్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అష్టదళ పాద పద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు చేసింది.

ఎన్ఆర్ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేసింది. తిరుపతిలో ఫిబ్రవరి 3 – 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీని రద్దు చేసింది. ⁠ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు, బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఫిబ్రవరి 03న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని టీటీడీ వెల్లడించింది. ⁠ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు ఉన్న భక్తులు వేచి ఉండకుండా నిర్ణీత సమయంలో మాత్రమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేసింది.

Share this post with your friends