Tirumala Update: మార్చి 2న స్థానికులకు శ్రీవారి దర్శన టోకెన్ల జారీ

ప్రతి నెలా మొదటి మంగళవారం (మార్చి 04)స్థానికులకు కల్పించే దర్శనంలో భాగంగా మార్చి 02వ తేది ఆదివారం నాడు స్థానిక దర్శన కోటా టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది.

ఈ మేరకు తిరుపతి స్థానికులకు మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలోను, తిరుమల స్థానికులకు బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఉదయం 5 గంటల నుండి శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు.

ఈ విషయాన్ని గమనించి తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలకు చెందిన స్థానిక భక్తులు ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాల్సిందిగా విజ్ఞప్తి చేయడమైనది. మరింత సమాచారం మా భక్తి టీవీ లైవ్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది.

Share this post with your friends