తిరుమల శ్రీవారి భక్తులకు ఏమైనా సందేహాలుంటే నెరవేర్చుకోండిలా..

తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు దర్శనం విషయంలో కానీ.. రూమ్స్ విషయంలో కానీ మరే ఇతర విషయంలోనైనా సందేహాలు ఉండవచ్చు. వాటిని తీర్చుకునే అవకాశం భక్తులకు వచ్చింది. డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్యక్రమం సెప్టెంబరు 6వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2 నుంచి 2.50 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల అన్నమ‌య్య భవనంలో జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంక‌టేశ్వర భ‌క్తి ఛాన‌ల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావుకి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు 0877-2263261 నంబర్‌లో సంప్రదించాలని టీటీడీ తెలిపింది.

ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంను తనిఖీ చేసిన అదనపుఈవో..

తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠాన్ని బుధవారం సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో శ్రీ సి హెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు. అందులో భాగంగా వేద విజ్ఞాన పీఠంలో వేద విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించి, టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఈ సత్యనారాయణ, ధర్మగిరి ప్రిన్సిపల్ శ్రీ అవధాని, విజిఓ శ్రీరాంకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share this post with your friends