తిరుమల శ్రీవారి అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.51 లక్షల విరాళం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదం ట్రస్ట్‌కు విరాళం గుంటూరు చెందిన మహిళ విరాళం అందించారు. గుంటూరుకు చెందిన భాష్యం డెవెలపర్స్ సంస్థ డైరెక్టర్ శ్రీమతి డి.కస్తూరి ఆదివారం శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.51 లక్షలు విరాళంగా అందించారు. ఇందుకు సంబంధించిన చెక్కును దాత అదనపు ఈవో శ్రీ సి.హెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు.

తిరుమలలో ఓ వ్యక్తి మనీ పర్సు పోగొట్టుకున్నాడు. అతనికి టీటీడీ విజిలెన్స్ అధికారులు మనీ పర్స్ అందజేశారు. వీక్యూసీ 2 వద్ద స్కానింగ్ ప్రక్రియలో ఓ భక్తుడు తన మనీ పర్స్ మిస్ అయ్యాడు. ఆ పర్సులో రూ.1,43,866 నగదు ఉంది. విషయాన్ని సదరు భక్తుడు టీటీడీ విజిలెన్స్ అధికారులకు చెప్పడంతో వారు సీసీటీవీని రీప్లే చేసి ా పర్సును గుర్తించి అతనికి అందజేశారు. త్వరితగతిన స్పందించి మనీ పర్సును యజమానులకు అప్పగించినందుకు టీటీడీ విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేశ్ వి, ఏఎస్ఐ ఎస్పీఎఫ్ శ్రీ వెంకన్నలను టీటీడీ సీవీఎస్వో శ్రీ శ్రీధర్ అభినందించారు.

Share this post with your friends