టీటీడీకి రూ.1.23 కోట్లు విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీ ఎస్వీ అన్నదానం, శ్రీ ఎస్వీ ప్రాణదానం, శ్రీ ఎస్వీ విద్యాదానం విభాగాలకు మంగళవారం భూరి విరాళం అందింది. కర్నాటక రాష్ట్రం బళ్ళారికి చెందిన శ్రీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు ఈ విరాళాన్ని అందజేశారు. శ్రీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు రూ.1.23 కోట్లు విరాళం అందింది. ఈ మేరకు డిడిలను తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో
టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. విరాళం వివరాలు ఇలా ఉన్నాయి. రూ. 1,01,11,111 విరాళాన్ని ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు, రూ.11,11,111 విరాళాన్ని ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్ కు, రూ. 11,11,111 విరాళాన్ని ఎస్వీ విద్యాదానం ట్రస్ట్ కు సదరు సంస్థ ప్రతినిధులు డిడిలను అందజేశారు.

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

తిరుపతికి చెందిన కేఎస్పీ టాకీస్ చైర్మన్ శ్రీ కేతన్ శివ ప్రీతమ్ టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు మంగళవారం రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు విరాళం డీడీని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి తిరుమలలోని ఆయన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా దాతను అదనపు ఈవో అభినందించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.

Share this post with your friends