
తిరుమలలో రథసప్తమి సందర్భంగా నిర్వహించే వాహన సేవల వివరాలతో పాటు భక్తులకు టీటీడీ ఇచ్చిన బిగ్ అలర్ట్ ఏంటో తెలుసుకుందాం.
రథసప్తమి సందర్భంగా వాహనసేవల వివరాలు :
– తెల్లవారుజామున 5.30 నుంచి 8 గంటల వరకు (సూర్యోదయం ఉదయం 6.45 గంటలకు) – సూర్యప్రభ వాహనం.
– ఉదయం 9 నుంచి 10 గంటల వరకు – చిన్నశేష వాహనం.
– ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహనం.
– మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు – హనుమంత వాహనం.
– మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు – చక్రస్నానం.
– సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం.
– సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం.
– రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం.
రథసప్తమి సందర్భంగా భక్తులకు బిగ్ అలర్ట్ ఏంటంటే.. ఆ రోజున ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేయడం జరిగింది.
– కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు.
– ఎన్.ఆర్.ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాల రద్దు.
– తిరుపతిలో జనవరి 24 నుంచి 26వ తేది వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ రద్దు.
– ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు, బ్రేక్ దర్శనాలకు సంబంధించి జనవరి 24న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.
