పంచమూర్తులలో మూలమూర్తి మినహా ఇతర మూర్తులు..

తిరుమల శ్రీ మలయప్ప స్వామివారి ఆలయంలో వైఖానస ఆగమనం ప్రకారం నిర్వహించే నిత్య పూజలను అందుకునే ఐదుగురు స్వామివార్ల రూపాలను “పంచమూర్తులు” లేదా “పంచబేరాలు” అంటారు. వీరిలో ఉత్సవ మూర్తి, భోగ శ్రీనివాస మూర్తి లేదా కౌతుక బేరము గురించి తెలుసుకుందాం.

ఉత్సవమూర్తి (శ్రీభూదేవి సమేత మలయప్పస్వామి): మలయస్ప స్వామి వారి రాకకు పూర్వం ఉగ్ర శ్రీనివాసమూర్తి ఉత్సవాలలో పాల్గొనేవారు.

పంచమూర్తులలో మూలమూర్తి మినహా ఇతర మూర్తులు..
పంచమూర్తులలో మూలమూర్తి మినహా ఇతర మూర్తులు..

భోగశ్రీనివాసమూర్తి (కౌతుకబేరము) :
ఈ మూర్తిని కౌతుక బేరము అని అంటారు. పదవశత్పాదములో స్వామివారి ఆలయంలో ప్రతిష్ఠింపబడిన రజత విగ్రహము. ఈ మూర్తికూడా ధ్రువమూర్తివలె చతుర్భుజమూర్తి, ఈ మూర్తి కూడా ధ్రువమూర్తివలె చతుర్భుజమూర్తి. ఈ మూర్తి పాదము క్రింద షట్కోణ యంత్రము ఒకటి వుంది. స్వామివారి నిత్యాభిషేకం, అర్చనలు కొరకు ఈ చరబింబమును ప్రతిష్ఠించటం జరిగింది. ఈ భోగశ్రీనివాస మూర్తిని ఒక సిల్కుదారముతో ధ్రువమూర్తికి అనుసంధానం చేసి వుంచుతారు. భోగశ్రీనివాసమూర్తి అన్నివిధములా ధ్రువమూర్తికి ప్రానిధ్యం వహించటం జరుగుతుంది. ధ్రువమూర్తికి గల అన్నిశక్తులు, అర్హతలు ఈ మూర్తికి కూడా వున్నాయి.

Share this post with your friends