Skip to content
Bhakthi TV
Bhakthi TV




Secondary Navigation Menu
Menu
  • హోమ్
  • వార్తలు
  • అర్చన
    • పండుగలు
    • పుణ్యక్షేత్రాలు
    • పూజలు
    • నోములు
    • పర్వదినాలు
    • వ్రతాలు
    • నైవేద్యాలు
    • వివాహం
    • ఆస్ట్రాలజీ
  • ధర్మ సందేహాలు
  • కోటి దీపోత్సవం
    • 2023
      • వార్తలు
      • ఫోటోలు
      • వీడియోస్
  • రాశి ఫలాలు
    • దినఫలం
    • వారఫలం
    • మాసఫలం
    • వార్షిక ఫలం
  • స్తోత్రాలు
  • గ్యాలరీ
  • భక్తి పత్రిక
  • భక్తి పంచాంగం
UPDATES
  • తిరుపతి : శ్రీకోదండరామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు. సూర్యప్రభవాహనంపై విహరిస్తూ దర్శనమిచ్చిన స్వామివారు. నేటి రాత్రి చంద్రప్రభవాహనంపై కోదండరామస్వామి తిరువీధి ఉత్సవం.
  • చిత్తూరు : శ్రీకామాక్షి అంబికా సమేత శ్రీఅగస్తీశ్వరస్వామి ఆలయంలో ఏప్రిల్ 2వ తేదీ వరకు పంగుణి ఉత్తర బ్రహ్మోత్సవాలు.
  • చిత్తూరు : ఈనెల 25 నుంచి ఏప్రిల్‌ 5వ తేదీ వరకు రాములుగుడివీధిలోని శ్రీకోదండరామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. 25న అంకురార్పణ, 26న ఉదయం ధ్వజారోహణం, ఏప్రిల్‌ 1న రథోత్సవం, 4న సీతారాముల కల్యాణం.
  • శ్రీశైలం (నంద్యాల జిల్లా) : ఏప్రిల్‌ 7న శ్రీభ్రమరాంబిక దేవికి కుంభోత్సవం. ప్రతీ ఏడాది చైత్రమాసంలో పౌర్ణమి తర్వాత భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. కుంభోత్సవం వరకు ప్రతి మంగళ, శుక్రవారాల్లో సాత్వికబలిగా అమ్మవారికి కొబ్బరి, గుమ్మడి, నిమ్మకాయలు సమర్పణ. ఏప్రిల్ 7న కుంభోత్సవం రోజున స్త్రీ వేషాధారణలో అమ్మవారికి కుంభహారతి సమర్పించనున్న ఆలయ ఉద్యోగి.
  • బనగానపల్లె (నంద్యాల జిల్లా) : నందవరంలోని చౌడేశ్వరిదేవి ఆలయంలో ఉగాది మహోత్సవాలు. నేటి సాయంత్రం ఆలయం నుంచి గ్రామంలోకి అమ్మవారి రథోత్సవం.
  • కొత్తపల్లి (నంద్యాల జిల్లా) : దుద్యాలలోని శ్రీలక్ష్మీ సమేత వేణుగోపాలస్వామి, పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి ఆలయంలో కల్యాణ మహోత్సవాలు. నేటి సాయంత్రం పారువేట, సీర్సావలి వసంతోత్సవం.
  • ఆస్పరి (కర్నూలు జిల్లా) : కైరుప్పలలోని శ్రీవీరభద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు. కనుల పండువగా శ్రీవీరభద్రస్వామి కాళికాదేవి రథోత్సవం.
  • వాల్మీకిపురం (అన్నమయ్య జిల్లా) : నేటి నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు వాల్మీకిపురంలోని పట్టాభిరామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు. నేటి సాయంత్రం అంకురార్పణ, ఈనెల 29న ఉదయం  రాత్రి శ్రీసీతారాముల కల్యాణం, 30న ఉదయం రథోత్సవం.
  • పుంగనూరు (అన్నమయ్య జిల్లా) : ఈనెల 25వ తేదీ నుంచి నగరి వీధిలోని సోమేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. 25న అంకురార్పణ, 31న సోమేశ్వరుడి కల్యాణం, ఏప్రిల్‌ 1న రథోత్సవం.
  • ఒంటిమిట్ట (కడప జిల్లా) : రేపు శ్రీకోదండరామస్వామి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం. ఈనెల 27న బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్న సందర్భంగా రేపు ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు ఆలయ శుద్ధి.
  • ఒంటిమిట్ట (కడప జిల్లా) : ఈనెల 26 నుంచి ఏప్రిల్‌ 5వ తేదీ వరకు ఒంటిమిట్ట శ్రీకోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఏప్రిల్‌ 1న సాయంత్రం 6.30 గంటలకు సీతారాముల కల్యాణం, 2న ఉదయం రథోత్సవం.
  • హిందూపురం (శ్రీసత్యసాయి జిల్లా) : సూరప్పకట్ట వద్ద గల బోయకొండ గంగమ్మ ఆలయంలో జాతర మహోత్సవాలు. పెన్నానదిలో ఘనంగా గంగపూజ. రేపు సాయంత్రం పూల కరగ మహోత్సవం, ఈనెల 25న వసంతోత్సవం.
  • పాలకొల్లు (ప.గో.జిల్లా) : నేటి నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి, లక్ష్మీ సమేత జనార్థనస్వామి వార్ల కల్యాణ మహోత్సవాలు.
  • తాడేపల్లిగూడెం (ప.గో.జిల్లా) : తాడేపల్లిగూడెంలో బలుసులమ్మ ఆలయంలో జాతరోత్సవాలు. ఈనెల 27న మహాకుంభ నివేదన.
  • రాజమహేంద్రవరం (తూ.గో.జిల్లా) : శ్యామలాంబ దేవి ఆలయంలో ఉగాది మహోత్సవాలు. నేత్రపర్వంగా శ్యామలాంబ దేవి రథోత్సవం.
  • పెద్దాపురం (తూ.గో.జిల్లా) : ఈనెల 29వ తేదీ నుంచి తిరుపతి గ్రామంలోని శ్రీశృంగార వల్లభస్వామి ఆలయంలో కల్యాణ మహోత్సవాలు. 29న శృంగార వల్లభుడి కల్యాణం, 30న కల్యాణమూర్తుల గ్రామోత్సవం, 31న కుంకుమపూజలు, ఏప్రిల్‌ 3న రాత్రి శ్రీపుష్పయాగం.
  • ద్వారకాతిరుమల (ఏలూరు జిల్లా) : క్షేత్రదేవత కుంకుళ్లమ్మ ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు. ఈనెల 27వ తేదీ వరకు లక్ష గాజుల అలంకరణలో కుంకుళ్లమ్మ అమ్మవారి దర్శనం.
  • సామర్లకోట (కాకినాడ జిల్లా) : కుమారారామా భీమేశ్వరాలయంలో వసంత నవరాత్రి మహోత్సవాలు. ఈనెల 27వ తేదీ వరకు ప్రతీరోజు యోగలింగమూర్తి భీమేశ్వరునికి, బాలాత్రిపుర సుందరి అమ్మవారికి ఏకాదశ రుద్రాభిషేకాలు.
  • ప్రత్తిపాడు (కాకినాడ జిల్లా) : నరేంద్రగిరిపై సీతారామచంద్రస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు. శాస్త్రోక్తంగా ప్రతిష్ఠామూర్తులకు అభిషేకం, తత్వన్యాసహోమం. ఈనెల 25న చినజీయర్‌స్వామి సమక్షంలో మమాకుంభ సంప్రోక్షణ, ప్రాణప్రతిష్ఠ, శాంతి కల్యాణం, ఈనెల 27న సీతారాముల కల్యాణం.
  • ఆత్రేయపురం (కోనసీమ జిల్లా) : ఈనెల 28 నుంచి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి దివ్య తిరుకల్యాణోత్సవాలు. 28న అంకురార్పణ, ధ్వజారోహణం, 29న మధ్యాహ్నం రథోత్సవం, రాత్రి శ్రీవారి కల్యాణం.
  • ఆత్రేయపురం (కోనసీమ జిల్లా) : ఈనెల 27 నుంచి వచ్చేనెల 2వ తేదీ వరకు ర్యాలీ జగన్మోహిని కేశవస్వామి ఆలయంలో వార్షిక కల్యాణ మహోత్సవాలు. ఈనెల 27న మధ్యాహ్నం గరుడోత్సవం, రాత్రి అంకురార్పణ, ధ్వజారోహణం, రాత్రి 8.30 గంటలకు జగన్మోహిని సమేత కేశవస్వామి కల్యాణం, ఏప్రిల్‌ 2న చక్రస్నానం, 3న శ్రీపుష్పోత్సవం.
  • అమలాపురం (కోనసీమ జిల్లా) : ఈనెల 25 నుంచి 29వ తేదీ వరకు అమలాపురంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో కల్యాణ మహోత్సవాలు. ఈనెల 28న శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణం, 29న తీర్థం, రథోత్సవం.
  • అల్లవరం (కోనసీమ జిల్లా) : దేవగుప్తంలోని శ్రీఉమాపార్వతీ మల్లేశ్వరస్వామి ఆలయంలో వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి యాగ మహోత్సవాలు. రేపు వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం.
  • విజయవాడ (ఎన్టీఆర్‌ జిల్లా) : ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో వసంత నవరాత్రి వేడుకలు. మల్లికార్జున మహామండపంలో తెల్లజిల్లేడు, మారేడు, తులసి, మరువం, ధవళంలతో దుర్గమ్మకు అర్చన.
  • విజయవాడ (ఎన్టీఆర్‌ జిల్లా) : ఈనెల 25 నుంచి 29వ తేదీ వరకు ఎన్టీఆర్‌కాలనీలోని కోదండ సీతారామాంజనేయస్వామి, విజయసిద్ధి గణపతి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు. ఈనెల 27న ఉదయం 10 గంటలకు సీతారాముల కల్యాణం.
  • పామర్రు (కృష్ణా జిల్లా) : ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు ఉండ్రపూడి-పోలవరం అడ్డరోడ్డులోని శ్రీవీరాంజనేయస్వామి ఆలయంలో శ్రీరామ నవమి కల్యాణ మహోత్సవాలు.
  • బాపట్ల : ఈనెల 29 నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు ఉప్పుటూరులోని వేంకటేశ్వరస్వామి, శ్రీచెన్నకేశవస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు.
  • మాచర్ల (పల్నాడు జిల్లా) : ఈనెల 31 నుంచి ఏప్రిల్‌ 15వ తేదీ వరకు లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు.
  • గిద్దలూరు (మార్కాపురం జిల్లా) : పాతబద్వేల్‌ రోడ్డులోని శ్రీసీతారామస్వామి ఆలయంలో వసంత నవరాత్రోత్సవాలు. ఈనెల 27న శ్రీరామశోభాయాత్ర, సీతారాముల కల్యాణం.
  • గురుగుబిల్లి (పార్వతీపురం మన్యం జిల్లా) : తోటపల్లిలోని వేంకటేశ్వర, కోదండరామస్వామి ఆలయంలో వసంత నవరాత్రోత్సవాలు. ఈనెల 27న దేవస్థానం ఆవరణలో సీతారాముల కల్యాణం, సాయంత్రం 6 గంటలకు పట్టాభిషేక మహోత్సవం.
  • అనకాపల్లి : సబ్బవరంలోని శ్రీసీతారామ ఉమారామలింగేశ్వరస్వామి ఆలయంలో వసంత నవరాత్రోత్సవాలు. ఈనెల 26న ఉదయం 9 గంటలకు పందిరి రాట మహోత్సవం, 27న మధ్యాహ్నం 12.19 గంటలకు సీతారాముల కల్యాణం.
  • అనకాపల్లి : శ్రీనూకాలమ్మ ఆలయంలో జాతర మహోత్సవాలు. వచ్చేనెల 17వ తేదీ వరకు అమ్మవారికి ప్రత్యేక పూజలు.
  • భీమునిపట్నం (విశాఖపట్నం జిల్లా) : భీమిలి సుభాష్‌రోడ్డులోని దాసాంజనేయస్వామి ఆలయంలో శ్రీరామ వసంత నవరాత్రోత్సవాలు. ఈనెల 27న సీతారాముల కల్యాణం, శ్రీరామసంకీర్తన, 29న భీమి పురవీధుల్లో సీతారాముల కల్యాణమూర్తుల ఊరేగింపు.
  • హైదరాబాద్‌ : పేట్‌బషీరాబాద్‌లోని సీతారామచంద్రస్వామి ఆలయంలో ఈనెల 28వ తేదీ వరకు 39వ వార్షిక బ్రహ్మోత్సవాలు.
  • హైదరాబాద్‌ : దిల్‌సుఖ్‌నగర్‌ భవానీనగర్‌లోని సీతారామాంజనేయస్వామి, సంతోషిమాత ఆలయంలో శ్రీరామనవమి వసంత నవరాత్రి మహోత్సవాలు. ఈనెల 26న పండ్ల రసాలతో శతకలశాభిషేకం, 27న ఉదయం 11.15 గంటలకు సీతారాముల కల్యాణం.
  • హైదరాబాద్‌ : సైదాబాద్ హౌజింగ్ బోర్డు కాలనీలోని సుదర్శన లక్ష్మణ హనుమత్‌ సమేత సీతారామచంద్రస్వామి ఆలయంలో స్వర్ణోత్సవాలు. ఈనెల 27న ఉదయం 11 గంటలకు సీతారాముల కల్యాణం, 28న ఉదయం 11 గంటలకు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం, 29న ఉదయం 10 గంటలకు రథోత్సవం.
  • హైదరాబాద్‌ : చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో చైత్ర నవరాత్రి మహోత్సవాలు. ఈనెల 26న అష్టమి హవనం, రాత్రి 7 నుంచి 12 గంటల వరకు మోహినీ రూపంలో భాగ్యలక్ష్మీ దర్శనం, 27న సాయంత్రం పల్లకీలో అమ్మవారి ఊరేగింపు.
  • హైదరాబాద్‌ : ఆల్విన్ కాలనీ వివేకానందనగర్ కాలనీలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో 35వ వార్షిక బ్రహ్మోత్సవాలు. నేటి సాయంత్రం హనుమంతవాహనంపై శ్రీవారి గ్రామోత్సవం, ఈనెల 26న రథోత్సవం, 27న సీతారామచంద్రస్వామి కల్యాణం.
  • అబ్దుల్లాపూర్‌మెట్‌ (రంగారెడ్డి జిల్లా) : కుత్బుల్లాపూర్‌లోని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు. వేడుకగా వీరబ్రహ్మేంద్రస్వామి రథోత్సవం. ఈనెల 25న విగ్రహ ప్రతిష్ఠాపన.
  • షాబాద్ (రంగారెడ్డి జిల్లా) : కొమరబండలోని శ్రీబుగ్గరామేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు. కనుల పండువగా రామేశ్వరస్వామి రథోత్సవం. ఈనెల 25న పార్వతీపరమేశ్వరుల కల్యాణం.
  • మొయినాబాద్ (రంగారెడ్డి జిల్లా) : ఈనెల 27వ తేదీ నుంచి చిలుకూరు బాలాజీ ఆలయంలో బ్రహ్మోత్సవాలు. 27న ఉదయం సెల్వర్‌కుత్తు ఉత్సవం, పుట్టమన్ను తెచ్చుట, బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, 28న ఉదయం ధ్వజారోహణం, 30న రాత్రి బాలాజీ, పద్మావతి, అలివేలుమంగమ్మ కల్యాణోత్సవం, 31న వసంతోత్సవం, ఏప్రిల్‌ 1న రాత్రి కల్యాణమూర్తుల రథోత్సవం.
  • జోగిపేట (సంగారెడ్డి జిల్లా) : జోగినాథస్వామి ఆలయంలో జాతరోత్సవాలు. ఘనంగా మండపారాధన, అఖండదీపస్థాపన, గరుడగంగా స్నానం. ఈనెల 25న రథ శిఖరం స్థాపన, 28న రాత్రి 9.30 గంటలకు రథోత్సవం, 30న అగ్నిగుండ ప్రవేశం, 31న శివపార్వతుల కల్యాణం, ఏప్రిల్‌ 1న రాత్రి 11 గంటలకు లంకాదహనం, 2న కుంకుమార్చన, రుద్రాభిషేకం.
  • నర్సాపూర్ (మెదక్‌ జిల్లా) : ఈనెల 27వ తేదీ నుంచి సీతారామంపూర్‌లోని సీతారామచంద్రస్వామి ఆలయంలో వార్షిక మహోత్సవాలు. 27న సీతారామచంద్రస్వామి కల్యాణం, 28న భవానీ రామలింగేశ్వరస్వామికి అభిషేకం, సామూహిక సత్యనారాయణ వ్రతాలు, 29న చండీ సప్తశతి మహాయాగం.
  • కొండమల్లేపల్లి (నల్గొండ జిల్లా) : ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు.
  • మిర్యాలగూడ (నల్గొండ జిల్లా) : ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు హనుమాన్‌పేట శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు.
  • లింగాలఘనపురం (జనగామ జిల్లా) : నవాబుపేటలోని కోదండరామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు. ఈనెల 27న సీతారాముల కల్యాణం, 28న  రథోత్సవం.
  • హన్మకొండ : రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల ఆలయంలో శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు. ఈనెల 27న విష్ణు ఆలయంలో సీతారాముల కల్యాణం.
  • వరంగల్‌ : శ్రీభద్రకాళీ అమ్మవారి ఆలయంలో వసంత నవరాత్రోత్సవాలు. ఈనెల 27వ తేదీ వరకు ప్రతీరోజు అమ్మవారికి రోజుకో రకం పూలతో భద్రకాళికి అర్చనలు.
  • భద్రాచలం : శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు. రేపు గరుడధ్వజపటలేఖనం, ధ్వజపట ఆవిష్కరణ, ఈనెల 25న ధ్వజారోహణం, ఈనెల 27న శ్రీరామనవమి పురస్కరించుకొని మిథిలా స్టేడియంలో శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణం, 28న శ్రీరామ మహాపట్టాభిషేకం. రేపటి నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిత్యకల్యాణాలు, దర్బారు సేవలు, 19 నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు పవళింపుసేవు నిలిపివేత.
  • ఖమ్మం : యూపీహెచ్‌ కాలనీలోని శ్రీఅభయ వేంకటేశ్వరస్వామి ఆలయంలో 22వ వార్షిక బ్రహ్మోత్సవాలు. వేదోక్తంగా చక్రస్నానం.
  • ఎర్రుపాలెం (ఖమ్మం జిల్లా) : జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు. ఈనెల 25న ఉదయం వకుళామాత స్టేడియంలో అలివేలుమంగా, పద్మావతి సమేతంగా శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం, సాయంత్రం గ్రామోత్సవం, 27న సీతారాముల కల్యాణం, 28న పూర్ణాహుతి, పుష్కరిణిలో చక్రస్నానం.
  • వేములవాడ (రాజన్న సిరిసిల్ల జిల్లా) : శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో శ్రీరామనవరాత్రోత్సవాలు. ఈనెల 27న ఉదయం 11.30 గంటలకు శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణం. 27వ తేదీ వరకు భీమేశ్వరాలయంలో కల్యాణాలు, సత్యనారాయణస్వామి వ్రతాలు, లింగార్చనల సేవలు నిలిపివేత.
  • జమ్మికుంట (కరీంనగర్‌ జిల్లా) : ఈనెల 25 నుంచి ఏప్రిల్‌ 6వ తేదీ వరకు ఇల్లందకుంటలోని శ్రీరామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు.
  • మల్యాల (కరీంనగర్‌ జిల్లా) : కొండగట్టు అంజన్న ఆలయంలో దీక్షాధారణలు ప్రారంభం. అధిక సంఖ్యలో తరలివచ్చి 11 రోజుల దీక్షలు స్వీకరిస్తున్న భక్తులు. వచ్చేనెల 2వ తేదీ చిన్నహనుమాన్‌ జయంతి వేడుకలు.
  • చారకొండ (నాగర్‌కర్నూలు జిల్లా) : ఈనెల 26 నుంచి ఏప్రిల్‌ 10వ తేదీ వరకు శిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు.
  • దామరగిద్ద (నారాయణపేట జిల్లా) : క్యాతన్‌పల్లిలోని శ్రీభద్రకాళి సమేత వీరభద్రేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు. నేటి రాత్రి 2 గంటలకు మహారథోత్సవం.
  • నారాయణపేట : ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు ధన్వాడలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు.
  • రాయగడ (కర్ణాటక) : ఈనెల 29 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు మజ్జిగౌరి అమ్మవారి ఆలయంలో చైత్రోత్సవాలు.
  • మండ్య (కర్ణాటక) : నేటి నుంచి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు మేలుకొటె చెలువనారాయణస్వామి ఆలయంలో వైరముడి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు. ఈనెల 28న రాత్రి వైరముడి కిరీటధారణ మహోత్సవం, 31న మహారథోత్సవం, ఏప్రిల్‌ 1న రాత్రి కల్యాణిలో తెప్పోత్సవం.
  • తమిళనాడు : కాంచీపురంలోని ఏకాంబరేశ్వరాలయంలో పంగుణి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఈనెల 27న ఉదయం 63 నాయనార్ల ఉత్సవం, 28న మహారథోత్సవం, 31న రాత్రి ఏకాంబరేశ్వరుడి కల్యాణం, ఏప్రిల్‌ 4న రాత్రి బంగారు విమానంలో తిరుమురై వేడుక.
  • తమిళనాడు : మైలాపూర్‌లోని కపాలేశ్వరాలయంలో పంగుణి ఉత్సవాలు. వైభవంగా ధ్వజారోహణం. ఈనెల 29న రథోత్సవం, 30న 63 నాయనార్ల ఊరేగింపు, ఏప్రిల్‌ 1న స్వామి, అమ్మవార్ల తిరుకల్యాణం.

Rathyatra

జగన్నాథుడి రథయాత్రలో విషాదం.. ప్రభుత్వం సీరియస్

2025-06-29
By: venkat
On: June 29, 2025

అంతర్వేదిలో అత్యంత వైభవంగా రథయాత్ర

2025-02-09
By: venkat
On: February 9, 2025

ఈ ఆలయంలోని మూడో మెట్టుపై అడుగు పెట్టారో.. యమపురిలో బెర్త్ కన్ఫర్మ్ అయినట్టే..!

2024-07-11
By: venkat
On: July 11, 2024

Bhakthi TV Live

Follow Us On

తాజా వార్తలు

Featured
హనుమంతుడు అనే పేరుకి పూర్తి వివరణ ఏంటంటే..

హనుమంతుడు అనే పేరుకి పూర్తి వివరణ ఏంటంటే..

తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో పుష్పయాగం ఎప్పుడంటే..

తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో పుష్పయాగం ఎప్పుడంటే..

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో 28 నుంచి బుగ్గోత్సవాలు

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో 28 నుంచి బుగ్గోత్సవాలు

పూజలు, పరిహారాల ఫలితం కొందరికి వెంటనే... మరికొందరికి ఆలస్యంగా ఎందుకు?

పూజలు, పరిహారాల ఫలితం కొందరికి వెంటనే… మరికొందరికి ఆలస్యంగా ఎందుకు?

దినఫలం | 15th April 2026 | Daily Horoscope | Horoscope by Sri Rayaprolu MallikarjunaSarma Bhakthi TV

  • About Us
  • Contact Us
  • Advertise With Us
  • Privacy Policy

Bhakthi TV is the first 24-hour satellite devotional TV channel in Telugu which caters to people of Hinduism. It is one of the most prominent devotional channels of both Telugu speaking States which are Andhra Pradesh and Telangana. Narendra Choudary Tummala launched Bhakti TV along with NTV on 30 August 2007.

Rachana Television Pvt Ltd.
Bhakthi TV Channel, 564 A / 19, III Road No 92, Jubilee Hills,
Hyderabad – 500 033, Telangana, India.
Mobile: +91 99494 94238,
Email: info@bhakthitv.in
Website: www.bhakthitv.in

© 2026 All Rights Reserved