
ఒరిస్సాలోని పూరి జగన్నాథుని ఆలయం వింతలూ విశేషాలకు నిలయం. ఈ ఆలయంలో చాలా వింతలున్నాయి. ఆలయ పై భాగం నుంచి కింది వరకూ చాలా వింతలున్నాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన జగన్నాథుని రథయాత్ర తాజాగా జరిగింది. దేశ విదేశాల నుంచి ఎంతో మంది భక్తులు ఈ రథయాత్రలో పాల్గొన్నారు. జగన్నాథ ఆలయాన్ని ఇలవైకుంఠంగా పేర్కొంటారు. ఇక ఈ ఇల వైకుంఠంగా పిలిచే ఆలయంలోని మూడు మెట్టు చాలా డేంజర్ అట. తెలియక అడుగు పెట్టారో యమపురికి బెర్త్ కన్ఫర్మ్ అయినట్టేనని అంటారు. ఇంతకీ ఆ మెట్టు ఎక్కడుంది? ఎందుకు అడుగు పెట్టకూడదో చూద్దాం.
జగన్నాథుని ఆలయ రహస్యాలలో మూడవ మెట్టు రహస్యం కూడా ఒకటి. ఆలయ ప్రధాన ద్వారం నుంచి స్వామివారి ఆలయంలోకి ప్రవేశించేందుకు 22 మెట్లు ఉన్నాయి. వీటిలో మూడవ మెట్టునే యమ శిల అని పిలుస్తుంటారు. ఈ మెట్టుపై అడుగు పెట్టి ఆయలంలోకి వెళ్లిన వ్యక్తి యమలోకంలో శిక్షను అనుభవిస్తారని చెబుతారు. అంతేకాదు.. ఆలయం నుంచి తిరిగి వస్తుండగా కూడా ఈ మూడవ మెట్టుపై అడుగు ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదట. పెడితే అప్పటి వరకూ సంపాదించుకున్న పుణ్యమంతా పోతుందట. ఈ క్రమంలోనే ఆలయ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అన్ని మెట్ల మాదిరిగా కాకుండా ఈ ఒక్క మెట్టు నలుపు రంగులో ఉంటుంది. దానిని చూసుకుని ఎవరూ దానిపై అడుగు పెట్టరు.
