Skip to content
Bhakthi TV
Bhakthi TV




Secondary Navigation Menu
Menu
  • హోమ్
  • వార్తలు
  • అర్చన
    • పండుగలు
    • పుణ్యక్షేత్రాలు
    • పూజలు
    • నోములు
    • పర్వదినాలు
    • వ్రతాలు
    • నైవేద్యాలు
    • వివాహం
    • ఆస్ట్రాలజీ
  • ధర్మ సందేహాలు
  • కోటి దీపోత్సవం
    • 2023
      • వార్తలు
      • ఫోటోలు
      • వీడియోస్
  • రాశి ఫలాలు
    • దినఫలం
    • వారఫలం
    • మాసఫలం
    • వార్షిక ఫలం
  • స్తోత్రాలు
  • గ్యాలరీ
  • భక్తి పత్రిక
  • భక్తి పంచాంగం
UPDATES
  • కేరళ : శబరిమల అయ్యప్ప ఆలయంలో వేడుకగా మండల పూజ మహోత్సవాలు. ఈనెల 27వ తేదీ ముగియనున్న మండలదీక్ష. ఈనెల 27న మండల పూజ. తిరిగి ఈనెల 30న మకర విళక్కు పూజల కోసం ఆలయాన్ని తెరవనున్న అర్చకులు. వచ్చేనెల 14వ తేదీన మకర జ్యోతి (మకర విళక్కు) దర్శనం. జనవరి 20న పడిపూజతో ముగియనున్న మకర విళక్కు సీజన్‌.
  • తిరుమల : ఆన్‌లైన్‌లో వచ్చే ఏడాది మార్చి నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల చేసిన తి.తి.దే. రేపు ఉదయం 10 గంటల వరకు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు భక్తులకు అవకాశం. రేపటి నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు నగదు చెల్లింపునకు భక్తులకు వెసులుబాటు.
  • తిరుమల : ఈనెల 22న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో మార్చి నెలకు సంబంధించి కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలాంకారణసేవ, శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవం, శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల టిక్కెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్‌సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించి టిక్కెట్ల కోటా విడుదల. 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్ల కోటా, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టిక్కెట్ల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ప్రత్యేక దర్శన టోకెన్ల కోటా విడుదల.
  • తిరుమల : ఈనెల 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో వతి గదుల కోటాను విడుదల చేయనున్న తి.తి.దే.
  • తిరుమల : ఈనెల 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం. ఈనెల 30 నుంచి జనవరి 1వ తేదీ వరకు ఈ-డిప్‌ ద్వారా 1.70 లక్షల మంది భక్తులకు టోకెన్లు కేటాయింపు. మొదటి మూడు రోజుల పాటు సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి టక్కెట్ల జారీ రద్దు.
  • తిరుమల : జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2 ద్వారా భక్తులకు సర్వదర్శనం. వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో తిరుపతిలో ఆఫ్‌లైన్‌లో జారీ చేసే సర్వదర్శనం టోకెన్లు, ప్రివిలేజ్‌ దర్శనాలు నిలిపివేత. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ దర్శనాలు, ఇతర ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు.
  • తిరుమల : వైకుంఠ ద్వార దర్శనానికి స్థానికులకు ఈ-డిప్ విధానంలో దర్శన టిక్కెట్లు కేటాయింపు. జనవరి 6, 7, 8 తేదీల్లో తిరుమల, తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి స్థానికులకు రోజుకు 5 వేల చొప్పున శ్రీవారి దర్శనం. ఈనెల 25వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో స్థానికులు రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం. ఈనెల 29న మధ్యాహ్నం 2 గంటలకు ఈ-డిప్‌ విధానంలో టిక్కెట్ల కేటాయింపు.
  • తిరుమల : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. దేవదేవుడి దర్శనార్థం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు. టోకెన్‌ లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటల సమయం.
  • తిరుమల : శ్రీవారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు. వచ్చేనెల 14వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ రద్దు. సుప్రభాతంకు బదులుగా తిరుప్పావైతో శ్రీవారి మేలుకొలుపు.
  • తిరుమల : ఈనెల 23వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం. కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం సందర్భంగా వీఐపీ బ్రేక్‌ దర్శనం రద్దు. 22న సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు.
  • తిరుమల : తెలంగాణలోని కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి తి.తి.ధే. నిధులు మంజూరు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సిఫార్సు మేరకు కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి రూ.30 కోట్లు కేటాయించిన తి.తి.దే. త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం.
  • శ్రీకాళహస్తి (తిరుపతి జిల్లా) : ధనుర్మాసాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తీశ్వరాలయంలో దర్శన వేళల్లో మార్పు. వచ్చేనెల 15వ తేదీ వరకు తెల్లవారుజామున 3 గంటలకు జేగంట, 4 గంటలకు మంగళవాయిధ్యాలు, 4.15గంటలకు గోపూజ, తిరుమంజనం, 4.30 గంటలకు పళ్లియరపూజ, 5 గంటలకు సర్వదర్శనం, ఏకాంతంగా ప్రథమ కాల అభిషేకాలు, 6న ద్వితీయకాలాభిషేకం, 7న పరివార దేవతా నివేదన, 7.30 గంటలకు గొబ్బిదేవత ఉత్సవం, 10.30 గంటలకు మూడోకాల అభిషేకం, సాయంత్రం 5 గంటలకు ప్రదోష కాలాభిషేకం. శుక్ర, శని, ఆది, సోమవారాల్లో రాత్రి 9 గంటలకు పళ్లియరపూజ, మిగిలిన రోజుల్లో రాత్రి 8.30 గంటలకు పళ్లియరపూజ.
  • చిత్తూరు : కోదండ రామాలయంలో ధనుర్మాస తిరుప్పావై పూజలు. ఈనెల 30న వైకుంఠ ఏకాదశి, 31న ద్వాదశి, జనవరి 1న నాయకనాయ పాశురం, 11న గుడారవళ్లీ, 12న నమ్మాళ్వార్‌ శాత్తుమొరై, 13న విరాట్టు ఉత్సవం, 14న ఆండాళ్‌ తిరుకల్యాణం, 15న విశ్వరూప దర్శనం, సీతారాముల కల్యాణం.
  • మద్దికెర (కర్నూలు జిల్లా) : పెరవలిలోని శ్రీరంగనాథస్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు. ఈనెల 30న ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉత్తరద్వారం గుండా గరుడవాహనంపై శ్రీదేవి భూదేవి సమేత రంగనాథస్వామి ఉత్సవమూర్తుల దర్శనం. జనవరి 14న గోదాదేవి, రంగనాథస్వామి కల్యాణం, ప్రభోత్సవం.
  • శ్రీశైలం (నంద్యాల జిల్లా) : శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో మల్లన్న స్పర్శ దర్శనాల స్లాట్ల పెంపు. భక్తుల విజ్ఞప్తి మేరకు దేవస్థాన అధికారుల నిర్ణయం. జనవరి నుండి శని, ఆది, సోమవారాల్లో 6 స్లాట్ల ద్వారా స్పర్శ దర్శనం. ఆన్‌లైన్‌లో స్పర్శ దర్శనం టికెట్స్‌ బుక్ చేసుకునేందుకు భక్తులకు అవకాశం.
  • శ్రీశైలం (నంద్యాల జిల్లా) : నేటి సాయంత్రం శ్రీశైలం చేరుకోనున్న భారత చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ జ్ఞానేష్‌. సాయంత్రం 5.25 గంటలకు శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్లను దర్శించుకొని, హారతి, అభిషేకంలో పాల్గొననున్న చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ జ్ఞానేష్. తిరిగి రేపు తెల్లవారుజామున 4.25 గంటలకు శ్రీస్వామి, అమ్మవార్లను దర్శించుకోనున్న ఎలక్షన్‌ చీఫ్ కమిషనర్‌.
  • ఆళ్లగడ్డ (నంద్యాల జిల్లా) : అహోబిలం శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు. జనవరి 14వ తేదీ వరకు ప్రతీరోజు తెల్లవారుజామున దిగువ అహోబిలంలోని గోదాదేవి సన్నిధిలో అమ్మవారి వ్రతం. జనవరి 14న గోదాదేవి కల్యాణం.
  • ద్వారకాతిరుమల (ఏలూరు జిల్లా) : చిన్నవెంకన్న ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు. జనవరి 14వ తేదీ వరకు ప్రతీరోజు తెల్లవారుజామున శ్రీవారికి సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై సేవ, ఉదయం శ్రీవారి గ్రామోత్సవం, ఈనెల 29న గిరిప్రదక్షిణ, 30న తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉత్తర ద్వార దర్శనం, 30 నుంచి జనవరి 9వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు.
  • కామవరపుకోట (ఏలూరు జిల్లా) : ద్వారకాతిరుమల చిన్నవెంకన్న దత్తత ఆలయం తూర్పుయడవల్లి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు. జనవరి 14వ తేదీ వరకు ప్రతీరోజు ఉదయం, సాయంత్రం గోదారంగనాథులకు ప్రత్యేక పూజలు, శ్రీకృష్ణ గోదా అష్టోత్తరములు, తిరుప్పావై సేవలు. 30న ఉత్తర ద్వార దర్శనం, జనవరి 11న కూడారై ఉత్సవం, 108 వెండి గంగాళాలతో ప్రసాద నివేదన, 14న ఉదయం గోదా రంగనాథుల కల్యాణం.
  • కైకలూరు (ఏలూరు జిల్లా) : మీసాల వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు. వచ్చేనెల 14వ తేదీ వరకు ప్రతీరోజూ గోదా సమేత వేంకటేశ్వరస్వామికి అష్టోత్తర శతనామార్చన, 25న లక్ష తులసి పూజ, 30న ఉత్తర ద్వార దర్శనం, 11న కూడారై ఉత్సవం, 14న గోదా సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణం.
  • కోరుకొండ (తూ.గో.జిల్లా) : కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు. వచ్చేనెల 14వ తేదీ వరకు ప్రతీరోజు తెల్లవారుజామున తిరుప్పావై ప్రవచనం. ఈనెల 29న నారసింహునికి పంచామృతాభిషేకం, 30న ఉత్తర ద్వార దర్శనం, కాపవరంలో నృసింహుడి గ్రామోత్సవం, జనవరి 14న గోదారంగనాథస్వామి తిరుకల్యాణం.
  • బిక్కవోలు (తూ.గో.జిల్లా) : బలభద్రపురంలోని శ్రీదేవి, భూదేవి సహిత ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు. నేటి సాయంత్రం కల్పవృక్షవాహనంపై శ్రీకృష్ణ అలంకరణలో శ్రీవారి తిరువీధి ఉత్సవం.
  • దేవరపల్లి (తూ.గో.జిల్లా) : దేవరపల్లిలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు. వచ్చేనెల 13వ తేదీ వరకు ప్రతీరోజూ తెల్లవారుజామున 4.30 గంటలకు స్వామివారి ప్రాతఃకాల అర్చన, 5.30 గంటలకు తిరుప్పావైసేవ, పంచ హారతులు, ఈనెల 30న తెల్లవారుజామున 5 గంటలకు ఉత్తరద్వార దర్శనం ప్రారంభం, జనవరి 13న గోదారంగనాథుల కల్యాణం.
  • ఆత్రేయపురం (కోనసీమ జిల్లా) : వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు. జనవరి 14వ తేదీ వరకు ప్రతీరోజు సుప్రభాతసేవకు బదులుగా తిరుప్పావై సేవాకాలం, ప్రతి శుక్రవారం గోదాదేవి పల్లకీ ఉత్సవం, ప్రతి శనివారం తిరుప్పావై సేవాకాలం, జనవరి 13న గోదారంగనాథుల కల్యాణం.
  • అంతర్వేది (కోనసీమ జిల్లా) : శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు. జనవరి 14వ తేదీ వరకు తెల్లవారుజామున 4.30 గంటలకు నారసింహుడికి ఆర్జిత అభిషేకం, ఉదయం పల్లకీసేవ, సుదర్శన హోమం, రాత్రి 7.30 గంటలకు ఆలయ ద్వారాలు మూసివేత.
  • మామిడికుదురు (కోనసీమ జిల్లా) : అప్పనపల్లి బాలబాలాజీస్వామి ఆలయంలో ధనుర్మాస వ్రతం. వచ్చేనెల 14వ తేదీ వరకు ప్రతీరోజు తెల్లవారుజామున 5 గంటలకు దివ్య ప్రబంధ సేవాకాలం, తిరుప్పావై సేవ. జనవరి 14న గోదాదేవి కల్యాణోత్సవం.
  • కపిలేశ్వరపురం (కోనసీమ జిల్లా) : అంగరలోని శ్రీరుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి, శ్రీఅలివేలుమంగా గోదాదేవి సమేత శ్రీవైభవ వేంకటేశ్వరస్వామి, కపిలేశ్వరపురం శ్రీదేవి, భూదేవి సమేత జనార్థనస్వామి ఆలయాల్లో ధనుర్మాసోత్సవాలు. జనవరి 14వ తేదీ వరకు ప్రతీరోజు విశేష అభిషేకం.
  • అన్నవరం (కాకినాడ జిల్లా) : శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు. ఈనెల 30న ఉత్తర ద్వార దర్శనం, ఉదయం 11 గంటలకు వెండిరథంపై ప్రాకారసేవ, రాత్రి కొండ దిగువన గరుడవాహనోత్సవం, గ్రామోత్సవం. జనవరి 14న ఆలయ ప్రాంగణంలో భోగి, 16న ప్రభోత్సవం.
  • పిఠాపురం (కాకినాడ జిల్లా) : రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు. జనవరి 15న గరుడవాహనంపై రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలుడి గ్రామోత్సవం.
  • కాకినాడ : ద్వారకానగర్‌లోని కనకమహాలక్ష్మీ ఆలయంలో కుంభాభిషేక వేడుకలు. భక్తిప్రవత్తులతో మహాకుంభాభిషేకం.
  • భీమవరం (ప.గో.జిల్లా) : మావుళ్లమ్మ ఆలయంలో అమ్మవారి మూలవిరాట్‌ దర్శనం నిలిపివేత. మావుళ్లమ్మ ఆలయ వార్షిక మహోత్సవాల సందర్భంగా అలంకరణ పనుల నిమిత్తం మూలవిరాట్‌ దర్శనం నిలిపివేత. ఆలయం వెనుక ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మందిరంలో అమ్మవారి ఉత్సవమూర్తికి, కళలు నిక్షిప్తం చేసిన కలశానికి పూజలతో పాటు నిత్య కైంకర్యాలు.
  • ఈనెల 29వ తేదీ ఉదయం 10.30 గంటలకు మావుళ్లమ్మ మూలవిరాట్‌ దర్శనం పునఃప్రారంభం.
  • పాలకొల్లు (ప.గో.జిల్లా) : రేపటి నుంచి ఆర్‌.ఆర్‌.రైస్‌మిల్లు ప్రాంగణంలో మూడు రోజలు పాటు శ్రీవేంకటేశ్వరస్వామి 33వ కల్యాణ మహోత్సవాలు. రేపు తి.తి.దే. శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం, ఈనెల 21న అన్నవరం సత్యదేవుని విగ్రహాలతో సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు, 22న వేంకటేశ్వరస్వామి రథోత్సవం.
  • విజయవాడ (ఎన్టీఆర్‌ జిల్లా) : ముత్యాలంపాడులోని షిర్డీ సాయిబాబా ఆలయంలో ధనుర్మాసోత్సవాలు. జనవరి 14వ తేదీ వరకు ప్రతీ రోజు బ్రహ్మీముహూర్తంలో విష్ణు సహస్రనామ పారాయణం. ఈనెల 30న ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని నగర సంకీర్తన.
  • విజయవాడ (ఎన్టీఆర్‌ జిల్లా) : సీతానగరం కొండపై విజయకీలాద్రి దివ్య క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు. వచ్చేనెల 14వ తేదీ వరకు ప్రతీరోజు నిత్యం గోదా అష్టోత్తర శతనామార్చన, పాశురాల పఠనం, సారె సమర్పణ. జనవరి 14వ తేదీ గోదారంగనాథుల కల్యాణం.
  • విజయవాడ (ఎన్టీఆర్‌ జిల్లా) : దేవీనగర్‌లోని కోదండరామ మందిరంలో ధనుర్మాసోత్సవాలు. జనవరి 14వ తేదీ వరకు ఉదయం నిత్య పూజలు, సాయంత్రం విష్ణుసహస్రనామ పారాయణం, ఈనెల 30న మూల విరాట్టులకు పంచామృత స్నపన సహస్ర ధారాభిషేకం, జనవరి 3న గుత్తుల దీపారాధన, 8న ముత్యాల హారతులు, 11న 108 గిన్నెల కూడారై పాయసం సమర్పణ, 14న గోదాదేవి కల్యాణం.
  • పెనుగంచిప్రోలు (ఎన్టీఆర్‌ జిల్లా) : శ్రీతిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో మండల దీక్షాధారణలు. ఈనెల 21వ తేదీ వరకు కొనసాగనున్న దీక్షాధారణలు. జనవరి 1 నుంచి 10వ తేదీ వరకు అర్ధమండల దీక్షాధారణలు. ఫిబ్రవరి 1న అఖండ జ్యోతి స్థాపన, హోమగుండం ప్రజ్వలనతో పెద్ద తిరునాళ్లు ప్రారంభం, ఫిబ్రవరి 1న రాత్రి 9.05 గంటలకు తిరుపతమ్మ వార్షిక కల్యాణం, 2న జలబిందెల మహోత్సవం, 3న ఉదయం పొంగళి అంకసేవ, 4న దీవెన బండారు మహాపూర్ణాహుతి.
  • చల్లపల్లి (కృష్ణా జిల్లా) : పాగోలులోని శ్రీకైవల్యాశ్రమ చలాచల భోదేపదేశ మందిరంలో శ్రీకమలాత్మికా సహిత అచలేశ్వరస్వామి మందిరంలో కుంభాభిషేక మహోత్సవాలు. వైభవంగా సదాశివమూర్తి ప్రతిష్ట, శిఖరస్వామికి కుంభాభిషేకం, అనంతరం అచలేశ్వరస్వామి కల్యాణం.
  • అమరావతి : గోదావరి పుష్కరాలు -2027 తేదీలు ఖరారు. జూన్‌ 26 నుంచి జులై 7వ తేదీ వరకు 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు. పుష్కర తేదీలపై ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. 2027 జూన్‌ 26న పుష్కర ప్రవేశం, 2027 జులై 7న పుష్కర సమాప్తి. తిరుమల జ్యోతిష్య సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణప్రసాద్‌ అభిప్రాయం ఆధారంగా నిర్ణయం.
  • గుంటూరు : మంగళగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వచ్చేనెల 15వ తేదీ వరకు ధనుర్మాస మహోత్సవాలు. ఈనెల 29న జగన్మోహిని అలంకరణలో నృసింహుడి గ్రామోత్సవం. ఈనెల 30న ఉత్తరద్వార దర్శనం, బంగారు గరుడవాహనంపై దర్శనమివ్వనున్న శ్రీదేవి, భూదేవి సమేత నారసింహుడు, రాత్రి నమ్మళ్వార్ అధ్యయనోత్సవాలు, 30, 31 తేదీల్లో భక్తులకు శంఖుతీర్థం.
  • గుంటూరు : గోరంట్ల శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థాన సొసైటీ పర్యవేక్షణలోని పద్మావతీ ఆండాళ్‌ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో దశావతార కల్యాణోత్సవాలు. మత్స్యావతారంలో దర్శనమిస్తున్న వేంకటేశ్వరుడు.
  • పిట్టలవానిపాలెం (బాపట్ల జిల్లా) : అల్లూరు గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు. జనవరి 1వ తేదీ వరకు ప్రతీరోజు తెల్లవారుజామున 5 గంటలకు తిరుప్పావై సేవా కాలం, ఉదయం 7 గంటలకు గోదాదేవి అమ్మవారి గ్రామోత్సవం, ఈనెల 28న రాత్రి 7 గంటలకు నారసింహుడికి పొన్నమాను వాహనసేవ, 29న రాత్రి 7 గంటలకు గజవాహనంపై నృసింహుడి తిరువీధి ఉత్సవం, 30న ఉత్తర ద్వారదర్శనం, దక్షిణవృత శంఖం ద్వారా తీర్థం పంపిణీ, ఉదయం 10 గంటలకు గరుడవాహనంపై శ్రీలక్ష్మీనరసింహస్వామి గ్రామోత్సవం.
  • బుచ్చిరెడ్డిపాళెం (నెల్లూరు జిల్లా) : ధనుర్మాస సందర్భంగా జొన్నవాడ శ్రీమల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయంలో దర్శన వేళల్లో మార్పు. జనవరి 14వ తేదీ వరకు ప్రతీరోజు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు, ప్రతీ శుక్రవారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 9.30 గంటల వరకు మల్లికార్జునస్వామి, కామాక్షితాయి అమ్మవార్ల దర్శనం.
  • ఒంగోలు (ప్రకాశం జిల్లా) : గడియారం వారి వీధిలోని శ్రీఅనంత కోదండరామస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు. ఈనెల 30న ఉత్తర ద్వార దర్శనం, జనవరి 4న శ్రీసుదర్శన లక్ష్మీనారసింహ యజ్ఞం, జనవరి 11న 108 కూడారై ఉత్సవం, 13న శ్రీగోదా కల్యాణం.
  • మునగపాక (అనకాపల్లి జిల్లా) : పంచాయతీ వీధిలోని సీతారామస్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు. జనవరి 14వ తేదీ వరకు ప్రతీరోజు విష్ణుసహస్రనామార్చన, శ్రీరామ అష్టోత్తరం, గోదాదేవి అమ్మవారికి కుంకుమార్చన. ఈనెల 30న ఉత్తర ద్వార దర్శనం, 14న శ్రీగోదాదేవి అమ్మవారికి దివ్య కల్యాణం.
  • పాయకరావుపేట (అనకాపల్లి జిల్లా) : రాధారుక్మిణి సహిత పాండురంగస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు. జనవరి 14వ తేదీ వరకు ప్రతీరోజూ ధనుర్మాస పూజలు. మత్స్యావతారంలో దర్శనమిస్తున్న పాండురంగడు. ఈనెల 30న ఉత్తర ద్వార దర్శనం, స్వామివారి వైకుంఠ మండపసేవ, లక్ష తులసిపూజ, లక్ష కుంకుమార్చన, గరుడవాహనసేవ.
  • నక్కపల్లి (అనకాపల్లి జిల్లా) : ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు. జనవరి 14వ తేదీ వరకు ప్రతీరోజు ధనుర్మాస సేవలు, తిరుప్పావై పాశుర విన్నపం, తిరువీధి సేవలు. ఉత్సవాల్లో భాగంగా మాడవీధుల్లో వివిధ వాహనాలపై ఉభయదేవేరులతో కలిసి స్వామివారు, పల్లకీపై గోదాదేవి అమ్మవారి ఉత్సవమూర్తుల ఊరేగింపు. ఈనెల 30న ఉత్తర ద్వార దర్శనం, సాయంత్రం ఎనిమిది వాహనాలపై వేంకటేశ్వరస్వామి తిరువీధి ఉత్సవం, జనవరి 13న గోదాదేవి కల్యాణం, 15న స్వామివారి గిరిప్రదక్షిణ.
  • విశాఖపట్నం : సీతారామాలయంలో ధనుర్మాస పూజలు. వచ్చేనెల 14వ తేదీ వరకు ప్రతీరోజు ఉదయం తిరుప్పావై పాశురవిన్నపం, విశేష అర్చనలు. ఈనెల 30న ఉదయం 5.30 గంటలకు సీతారాముల ఉత్సవమూర్తులకు క్షీరాభిషేకం, పాశురవిన్నపం, ఉత్తర ద్వార దర్శనం, సహస్రనామార్చన.
  • విశాఖపట్నం : స్టీల్‌ప్లాంట్‌ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు. వచ్చేనెల 14వ తేదీ వరకు ప్రతీరోజు ఉదయం గోత్రనామార్చన, గోదాదేవికి సుప్రభాతసేవ, ఆరాధన, తిరుప్పావై, పాశురవిన్నపం. ఈనెల 30న ఉత్తర ద్వార దర్శనం, జనవరి 5న తిరువీధి రథోత్సవం, 9 నుంచి 13వ తేదీ వరకు గోదాదేవికి అభిషేకం, తోమాల సేవ, 11న కూడారై ఉత్సవం, 14న గోదాదేవి కల్యాణం.
  • విశాఖపట్నం : ఎన్‌జీజీఓస్‌కాలనీ కప్పరాడలోని వైభవ వేంకటేశ్వరుడి దివ్యక్షేత్రంలో ధనుర్మాస మహోత్సవాలు. జనవరి 14వ తేదీ వరకు ప్రతీరోజు తెల్లవారుజామున 4.30 గంటలకు తిరుప్పావై పాశుర విన్నపం, విశేషభోగం, ఈనెల 30న ఉత్తరద్వార దర్శనం.
  • సింహాచలం (విశాఖపట్నం జిల్లా) : రేపటి నుంచి జనవరి 16వ తేదీ వరకు శ్రీవరాహలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పగల్‌పత్తు ఉత్సవాలు, ముక్కోటి ఏకాదశి, ధారోత్సవాలు, కనుమ పండుగ సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు. ఈనెల 31 నుంచి జనవరి 9వ తేదీ వరకు రాపత్తు సేవల సందర్భంగా ప్రతీరోజు సాయంత్రం 5 గంటలకు గ్రామ తిరువీధి ఉత్సవాలు, రాత్రి 7 గంటల నుంచి అప్పన్న దర్శనం నిలిపివేత. ఈనెల 13న గోదాదేవి కల్యాణం.
  • సింహాచలం (విశాఖపట్నం జిల్లా) : శ్రీవరాహలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు. జనవరి 20వ తేదీ వరకు ఆలయంలో సుప్రభాతసేవ, ఉదయం ఆరాధన టిక్కెట్లు రద్దు.
  • బుచ్చెయ్యపేట (విశాఖపట్నం జిల్లా) : వడ్డాది గిరిజాంబ గిరిపై కొలువైన శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు. ఈనెల 30న శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం, వచ్చేనెల 13న గోదాదేవి కల్యాణం, 14న గరుడోత్సవం.
  • పెందుర్తి (విశాఖపట్నం జిల్లా) : వేంకటాద్రిపై కొలువుదీరిన శ్రీనివాసుడి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు. వచ్చే ఏడాది జనవరి 14వ తేదీ వరకు ప్రతీరోజు తిరుప్పావై పాశుర విన్నపం. ఈనెల 30న ఉత్తరద్వార దర్శనం, గిరిప్రదక్షిణ, జనవరి 1న ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా నవనీత అలంకరణలో శ్రీనివాసుడి దర్శనం, జనవరి 4న సుదర్శన హోమం, 11న కూడారై ఉత్సవం, 13న తిరువీధి మహోత్సవం, 14న గోదా శ్రీరంగనాథుల కల్యాణం.
  • నాయుడుతోట (విశాఖపట్నం జిల్లా) : దరి రవినగర్ శేషాద్రిశిఖరంపై గల కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు. జనవరి 13వ తేదీ వరకు ప్రతీరోజు ఉదయం 5 గంటలకు సేవాకాలం, తిరుప్పావై, శాత్తుమొరై, ఈనెల 30న ఉదయం 5 గంటల నుంచి ఉత్తరద్వార దర్శనం, సాయంత్రం 6 గంటలకు సహస్రదీపాలంకరణ, ఊంజల్‌సేవ, జనవరి 11న కూడారై ఉత్సవం, అష్టోత్తర శత కలశాలతో (108 క్షీరాన్న) నివేదన, 13న ఆలయ ప్రాంగణంలో గోదా రంగనాథుల కల్యాణం.
  • మచిలీపట్నం (విశాఖపట్నం జిల్లా) : రంగనాయకస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు. ఈనెల 29న జగన్మోహిని అలంకారంలో రంగనాయకస్వామి దర్శనం, 30న ఉత్తర ద్వార దర్శనం, జనవరి 14న గోదాదేవి, రంగనాయకస్వామి కల్యాణ మహోత్సవం.
  • గురుగుబిల్లి (విజయనగరం జిల్లా) : తోటపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు. జనవరి 14వ తేదీ వరకు ఉత్సవ రోజుల్లో ప్రతీ రోజు ఉదయం వేంకటేశ్వరస్వామి, గోదాదేవి తిరువీధి ఉత్సవం. జనవరి 14న గోదాదేవి కల్యాణం.
  • హైదరాబాద్‌ : ఈనెల 21వ తేదీ సాయంత్రం 5 గంటలకు రవీంద్రభారతిలో దర్శనం మాస పత్రిక ఆధ్వర్యంలో "గురుసత్కారం". బృహత్‌ ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మకు జీవన సాఫల్య పురస్కారం, స్వర్ణకంకణం, ధార్మిక వరేణ్య బిరుదు ప్రదానోత్సవం. ముఖ్య అతిథులుగా హాజరుకానున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నాలుగు యూనివర్సిటీల వైస్‌ఛాన్స్‌లర్‌లు, మహాసహస్రావధాని గరికిపాటి నరసింహరావు.
  • హైదరాబాద్‌ : శ్రీనగర్‌కాలనీలోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో కొలువుదీరిన శ్రీఅయ్యప్పస్వామి ఆలయంలో మండల పూజా మహోత్సవాలు. ఈనెల 27న మహాపూర్ణాహుతి, లక్షపుష్పార్చన. ఈనెల 27వ తేదీ వరకు ప్రతీరోజూ ఉదయం శ్రీమహాగణపతి హోమం, పంచామృతాలతో అభిషేకం, సాయంత్రం పడిపూజ.
  • హైదరాబాద్‌ : శ్రీనగర్ కాలనీలని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు. ఈనెల 26న ఉదయం 5.30 గంటలకు సామూహిక లక్ష్మీ సహస్రనామ కుంకుమార్చన, జనవరి 4న ఉదయం 5.30 గంటలకు సామూహిక వేంకటేశ్వర సహస్ర నామ పుష్పార్చన.
  • హైదరాబాద్‌ : చిక్కపడపల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాస వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు. ఈనెల 25 నుంచి 29వ తేదీ వరకు పగల్‌పత్తు ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం 6 గంటలకు దేవాలయ ద్వారబంధనం, ఈనెల 30న ఉదయం 5 గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనం, 30 నుంచి జనవరి 3వ తేదీ వరకు రాపత్తు ఉత్సవాలు, 11న కూడారై ఉత్సవం, 13న రాత్రి 7 గంటలకు గోదా సమేత రంగనాథస్వామి కల్యాణం, 15న గోదా అమ్మవారి కరినోము ఉత్సవం.
  • హైదరాబాద్‌ : ఈనెల 30వ తేదీన చార్మినార్‌కు తూర్పువైపున చౌక్‌ మైదాన్ ఖాన్‌ వద్ద గల బాలాజీ ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు. 30న తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం, ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైకుంఠ ద్వార దర్శనం, జనవరి 13న సాయంత్రం 6 గంటలకు శ్రీగోదాదేవికల్యాణం, 15న సాయంత్రం 6 గంటలకు అమ్మవారి కరినోము.
  • హైదరాబాద్‌ : జియాగూడలోని రంగనాథస్వామి ఆలయంలో గోదాదేవి ధనుర్మాస ఉత్సవాలు. ఈనెల 30న తెల్లవారుజామున 2 గంటలకు మూలవిరాట్‌లకు అభిషేకం, 5 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం, గరుడవాహన సేవా దర్శనం, జనవరి 14న గోదారంగనాథుల కల్యాణం.
  • హైదరాబాద్‌ : గౌలిపురా కోదండ రామస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు. వచ్చేనెల 14వ తేదీ వరకు ప్రతీరోజు ఉదయం సేవాకాలం, శాత్తుమొరై, సాయంత్రం విష్ణుసహస్రనామ పారాయణం, ఈనెల 30న ఉత్తరద్వార దర్శనం, అధ్యయనోత్సవం.
  • హైదరాబాద్‌ : బీకేగూడ-ఎస్సార్‌నగర్‌ ప్రధాన రహదారిలోని బల్కంపేట శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు. ఈనెల 30న తెల్లవారుజామున 4.45 గంటలకు శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభం. జనవరి 14న గోదారంగనాథస్వామి తిరుకల్యాణం.
  • హైదరాబాద్‌ : మూసారాంబాగ్ ఆండాళ్‌ నిలయంలో ధనుర్మాస మహోత్సవాలు. ఈనెల 30న ఉత్తర ద్వార దర్శనం, జనవరి 2న మహిళలకు పసుపు, కుంకుమ, గాజులతో తాంబూలం పంపిణీ, 11న నీరాటోత్సవం సందర్భంగా 108 గంగాళాలతో అక్కరవడిశల్ ప్రసాద నివేదన, 14న గోదా రంగనాథుల కల్యాణం.
  • మల్కాజ్‌గిరి (సికింద్రాబాద్‌) : ఆనంద్‌బాగ్ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు. జనవరి 14వ తేదీ వరకు ప్రతీరోజు ఉదయం 5.30 గంటలకు తిరుప్పావై సేవ, శాత్తుమొరై. ఈనెల 23న శ్రవణ నక్షత్రం సందర్భంగా చందనసేవ, 25న తిరుప్పావడసేవ, 30న ఉత్తర ద్వార దర్శనం, 5న ఫలాలంకరణ సేవ, 8న గోదాదేవి, మహాలక్ష్మీ అమ్మవార్లకు గాజుల అలంకరణ, దీపోత్సవం, 11న కూడారై ఉత్సవం, 12న పుష్పయాగం, 14న గోదారంగనాథుల కల్యాణం, సాయంత్రం రథోత్సవం.
  • కడ్తాల్ (రంగారెడ్డి జిల్లా) : ఈనెల 21 నుంచి 31వ తేదీ వరకు అన్మాస్‌పల్లిలోని సరస్వతీ సభా ప్రాంగణంలో "ప్రపంచ ధ్యానదినోత్సవ సంబరాలు" పేరిట "పత్రీజీ ధ్యాన మహాయాగం-4".
  • యాదగిరిగుట్ట : శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు. జనవరి 14వ తేదీ వరకు ప్రతీరోజూ వేకువజామున 3.30 గంటలకు సుప్రభాతం, 4 గంటలకు తిరువారాధన, 4.30 గంటలకు తిరుప్పావై సేవాకాలం, శ్రీస్వామివారి ఆలయ ముఖమండపంపై గల ఉత్తర భాగంలోని హాల్‌లో అమ్మవారికి తిరుప్పావై సేవ, 6 గంటలకు స్వామివారికి నిజాభిషేకం, 7 గంటలకు సహస్రనామార్చన, 7.45 గంటలకు నృసింహుడి దర్శనానికి భక్తులకు అనుమతి. జనవరి 14న రాత్రి 7 గంటలకు గోదాకల్యాణం, 15న ఉదయం 11.30 గంటలకు ఒడిబియ్యం సమర్పణ.
  • యాదగిరిగుట్ట : ఈనెల 30న శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు. ఏటా మధ్యాహ్నం 12 గంటల వరకే ఉత్తర ద్వార దర్శనం. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం నుంచి రాత్రి వరకు ఉత్తర ద్వార దర్శనం.
  • గరిడేపల్లి (సూర్యాపేట జిల్లా) : పొనుగోడులోని శ్రీరుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు. జనవరి 14వ తేదీ వరకు ప్రతీరోజు తెల్లవారుజామున 4 గంటలకు స్వామివారికి దీపాలంకరణ, పల్లకీసేవ, ఊరేగింపు. జనవరి 11న కూడారై ఉత్సవం, 14న శ్రీరంగనాయక స్వామి సమేత గోదా అమ్మవారి కల్యాణం.
  • కాళేశ్వరం (జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా) : కాళేశ్వర క్షేత్ర అనుబంధ రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలు. జనవరి 14వ తేదీ వరకు ప్రతీరోజు పాశుర పారాయణం, ఈనెల 30న ఉత్తర ద్వార దర్శనం, జనవరి 14న గోదా రంగనాయకుల కల్యాణం.
  • భూపాలపల్లి (జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా) : రేపు భూపాలపల్లిలో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం.

different forms of god

భగవంతుడు ఒక్కడేనా? చాలా మంది ఉన్నారా?

2024-04-22
By: venkat
On: April 22, 2024

Bhakthi TV Live

Follow Us On

తాజా వార్తలు

పంచాంగం

భక్తి టీవీ పంచాంగం | 23rd January 2026 | Bhakthi TV Panchangam in Telugu | Bhakthi TV

దినఫలం | 23rd January 2026 | Daily Horoscope | Horoscope by Sri Rayaprolu MallikarjunaSarma

Aksharabhyasam on Vasant Panchami

Aksharabhyasam on Vasant Panchami : వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేయిస్తున్నారా… ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి

భక్తి టీవీ పంచాంగం | 22nd January 2026 | Bhakthi TV Panchangam in Telugu | Bhakthi TV

దినఫలం | 22nd January 2026 | Daily Horoscope | Horoscope by Sri Rayaprolu MallikarjunaSarma

  • About Us
  • Contact Us
  • Advertise With Us
  • Privacy Policy

Bhakthi TV is the first 24-hour satellite devotional TV channel in Telugu which caters to people of Hinduism. It is one of the most prominent devotional channels of both Telugu speaking States which are Andhra Pradesh and Telangana. Narendra Choudary Tummala launched Bhakti TV along with NTV on 30 August 2007.

Rachana Television Pvt Ltd.
Bhakthi TV Channel, 564 A / 19, III Road No 92, Jubilee Hills,
Hyderabad – 500 033, Telangana, India.
Mobile: +91 99511 90999,
Email: info@bhakthitv.in
Website: www.bhakthitv.in

© 2026 All Rights Reserved