Historic Moment : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివలింగం ప్రతిష్ట… ఎలా జరిగిందో తెలుసా?

బీహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లా మోతిహరి సమీపంలోని కైత్వాలియా గ్రామం భోళేనాథుని మహిమతో పులకించిపోయింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, భారమైన శివలింగాన్ని అక్కడ భక్తిశ్రద్ధల మధ్య ప్రతిష్టించారు. 33 అడుగుల పొడవుతో, 210 మెట్రిక్ టన్నుల బరువుతో పూర్తిగా గ్రానైట్‌తో తయారైన ఈ శివలింగం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. వారణాసి, అయోధ్య నుంచి వచ్చిన వేద పండితులు మంత్రోచ్ఛారణలతో ప్రాణప్రతిష్ట చేయగా, దేశవ్యాప్తంగా పవిత్ర నదుల జలాలతో భోలేనాథునికి అభిషేకం నిర్వహించారు. భారీ క్రేన్ల సాయంతో శివలింగాన్ని స్థాపించిన దృశ్యం అపూర్వం. అనంతరం హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించడం ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత శోభాయమానం చేసింది. ఇందులో 1008 చిన్న శివలింగాలు ఉండటంతో దీనికి ‘సహస్ర లింగం’గా నామకరణం చేశారు. విరాట్ రామాయణ ఆలయంలో ఈ ప్రతిష్ట భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.

A 33-foot 210-metric-ton single-stone granite Shivlinga
A 33-foot 210-metric-ton single-stone granite Shivlinga
Share this post with your friends