Koti Deepotsavam : కోటి దీపోత్సవ వైభవం

ఓవైపు ఓంకారం శంఖారావమై ప్రతిధ్వనిస్తుంది. మరోవైపు ‘అగ్నిమీళే పురోహితం’ అంటూ. వేదమంత్రఘోష మార్మోగుతుంది. ఇంకోవైపు ‘వాజశ్చమే ప్రసవశ్చమే ప్రయతిశ్చమే’ అంటూ నమక చమకాలు ప్రతిధ్వనిస్తుంటాయి. అన్నింటికీ మించి భక్తుల కోలాహలం, కార్తికమాసం వచ్చిందంటే చాలు… భాగ్యనగరంలో జరిగే భక్తిటీవీ కోటిదీపోత్సవ ప్రాంగణంలో కనిపించే సంరంభమిది. పన్నెండు కార్తికమాసాలుగా కార్యక్రమం జరుగుతున్నా ప్రతీ సంవత్సరం పరమాద్భుతమనే పదం తప్పించి మరో -మాట లేదు. ఈ ఏడాది సైతం భక్తిటీవీ కోటిదీపోత్సవం మీకు స్వాగతం పలుకుతోంది. దీపేన సాధ్యతే సర్వం అని వేదోక్తి. కోటిదీపోత్సవంలో వెలిగే ప్రతీ జ్యోతి సనాతన ధర్మ విజయానికి బాటలు వేస్తోంది. భవిష్యత్ తరాలకు కార్తికమాస గొప్పతనాన్ని తెలియజేస్తోంది. కోటిదీపాల వెలుగులు కైలాసశిఖరం వరకు ప్రకాశించేలా కాంతులు ప్రసరిస్తోంది.

Koti Deepotsavam : కోటి దీపోత్సవ వైభవం
Koti Deepotsavam : కోటి దీపోత్సవ వైభవం

పదమూడు సంవత్సరాల క్రితం జరిగిన అపూర్వ ఘట్టం. శృంగేరి దక్షిణామ్నాయ పీఠ జగద్గురువులు పుట్ట భారతీతీర్థమహాస్వామివారు విజయయాత్రలో భాగంగా భాగ్యనగరానికి విచ్చేశారు. వారికి గురువందనం చేయాలనే సంకల్పాన్ని రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత నరేంద్రచౌదరి వెంటనే ఆచరణలో పెట్టారు. కార్తికమాసంలో పరమేశ్వర స్వరూపులైన జగద్గురువు విచ్చేశారు గనుక.. శివునికి ప్రీతిపాత్రమైన దీపాలకాంతుల నడుమ గురువందనం చేయాలని భావించారు. ఆ మహాసంకల్పానికి ప్రతిరూపమే 2012లో భక్తిటీవీ మొట్టమొదటిసారి నిర్వహించిన లక్షదీపోత్సవం కార్యక్రమం. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా జరిగిన లక్ష దీపోత్సవ వైభవం పుష్కరకాలం గడిచినా మరపురాని అద్భుత జ్ఞాపకం. అయితే ఏ ముహూర్తంలో నరేంద్రచౌదరి సంకల్పించారో కానీ.. ఆ సంకల్పం మహాసంకల్పమైంది. ఓ మహోత్సవానికి నాంది పలికింది. ఆ మహాసంకల్పానికి ప్రతిరూపమే 2013లో ప్రారంభమైన భక్తిటీవీ కోటిదీపోత్సవం. కోటిదీపోత్సవం ఒక అఖండజ్యోతి. కార్తికమాసంలో మాత్రమే నిర్వహించే కార్యక్రమమైనా…. మిగతా 11 నెలలూ ఆ దీపకాంతుల పుణ్యఫలాలు ప్రసరిస్తూనే ఉంటాయి.

శ్రీమద్భాగవతం, శివపురాణం మరియు ఇతర పురాణాల సారం, కార్తిక మాసపు మాహాత్మ్యాన్ని నలుదిశలా వ్యాపింపజేసే దివ్య సంకల్పంతో, భక్తి టీవీ మరియు ఎన్టీవీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం – 2025’ మహోత్సవానికి సకల భక్తజనులందరికీ హృదయపూర్వక ఆహ్వానం.
కార్యక్రమ వివరాలు : నవంబర్ 1వ తేదీ నుండి నవంబర్ 13వ తేదీ వరకు.ప్రతిరోజూ సాయంత్రం 5:30 గంటల నుండి ఎన్టీఆర్ స్టేడియం, హైదరాబాద్.

Share this post with your friends