✪ భక్తి టీవీ కోటి దీపోత్సవం 2025, 3వ రోజు (03-11-2025) – కార్తిక సోమవారం (ప్రదోష వ్రతం) కార్యక్రమాలు ✪

* ప్రదోష వ్రతం శుభసందర్భంగా సకల శుభాలనొసగే కోటి లింగేశ్వరునికి ప్రదోషకాల అభిషేకం
* కోటి దీపోత్సవం మూడో రోజున బ్రహ్మశ్రీ డా|| మైలవరపు శ్రీనివాసరావు గారి ప్రవచనామృతం

* మూడు జన్మల పాపాలు హరించే వారణాసి శ్రీ విశ్వనాథునికి కోటి బిల్వార్చన
* కోటి దీపోత్సవ ప్రాంగణంలో భక్తులే స్వయంగా ఆచరించి తరించేలా “అద్భుతరీతిలో కాశీ – సప్తరుషి హారతి”

* కోటిదీపోత్సవంలో మొట్టమొదటిసారిగా శ్రీరామ ప్రతిష్టిత జ్యోతిర్లింగం “రామేశ్వరం శ్రీ రామనాథస్వామి కల్యాణోత్సవం”
* కోటి దీపోత్సవ ప్రాంగణానికి మయూర వాహనంలో భక్తులను అనుగ్రహించడానికి విచ్చేసిన రామేశ్వరం శ్రీ రామనాథస్వామి..!

* పుష్పగిరి మహాసంస్థానం శ్రీ జగద్గురు శంకరాచార్య పూజ్యశ్రీ విద్యాశంకరభారతి మహాస్వామీజీ వారి ఆశీర్వచనం

* శుక శంకర పీఠం శ్రీ భాగవతీయ జగద్గురు శంకరాచార్య శ్రీ బాలకృష్ణానంద మహాసంస్థానం శ్రీ శ్రీ శ్రీ గోవిందానంద సరస్వతీ మహాస్వామీజీ వారి అనుగ్రహభాషణం.

* రామేశ్వరం శ్రీ రామనాథస్వామి సన్నిధిలో “కార్తిక దీప ప్రజ్వలన”
* పరమ పవిత్రమైన కార్తిక సోమవార శుభవేళ బంగారు లింగోద్భవం వీక్షిస్తే మృత్యుంజయులవుతారు
* సప్త హారతుల వీక్షణం.. జన్మరాహిత్యానికి మార్గం..!
* కోటి దీపోత్సవ ప్రాంగణంలో స్టేడియం దద్దరిల్లేలా మహా శివలింగానికి మహానీరాజనం
* పుష్పగిరి మహాసంస్థానం శ్రీ జగద్గురు శంకరాచార్య పూజ్యశ్రీ విద్యాశంకరభారతి మహాస్వామీజీ వారికి గురు వందనం
* శుక శంకర పీఠం శ్రీ భాగవతీయ జగద్గురు శంకరాచార్య శ్రీ బాలకృష్ణానంద మహాసంస్థానం శ్రీశ్రీ శ్రీ శ్రీ గోవిందానంద సరస్వతీ
మహాస్వామీజీ వారికి గురు వందనం
* సాంస్కృతిక కదంబం (కోలాటం + పంబమేళా + నందికోలు)
* మహా మంగళ హారతి
