May 2024 Horoscope : మే మాసంలో ద్వాదశ రాశుల వారి మాసఫలాలు

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) :
మనోబలంతో పనులు పూర్తిచేస్తారు. ముఖ్య విషయాల్లో సానుకూల ఫలితాలు సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆర్థికంగా కలిసివచ్చినా అప్పులు పెరగకుండా చూసుకోవాలి. ముందుజాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర ఆందోళనలు పెట్టుకోకండి. తోబుట్టువుల కారణంగా మేలు జరుగుతుంది. నిత్యం రవి, కుజ, బుధ ధ్యానశ్లోకాలు పఠించండి.

వృషభం (కృత్తిక 2-4, రోహిణి, మృగశిర 1-2 పాదాలు) :
మంచి ఆరోగ్యం, ధనలాభం కలుగుతుంది. ప్రయత్నపూర్వక కార్యసిద్ధి లభిస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మిత్రుల సహకారంతో లక్ష్యాలకు చేరువవుతారు. చిన్న చిన్న ఆటంకాలు. ఎదురైనా అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం మేలు. ఒక సంఘటన మనస్థాపాన్ని కలిగిస్తుంది. శుభకార్యాల విషయంలో శ్రద్ధ అవసరం అవుతుంది. విష్ణు సహస్ర స్తోత్రం పారాయణ చేయండి.

మిథునం (మృగశిర 3-4, ఆర్ద్ర, పునర్వసు 1-3 పాదాలు) :
ధన లాభం ఉంది. కార్య విజయం కలుగుతుంది. భోజన సౌఖ్యం ఉన్నాయి. పట్టుదలతో చేసే పనులు విజయాన్నిస్తాయి. వత్తిడి దరిచేరనీయకండి. భవిష్యత్ ప్రణాళికలు అమలు చేసేందుకు సరైన కాలం, ఆటంకాలు కలగకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. ఆర్థికంగా సామాన్య కాలం. కుజ, బుధ ధ్యాన శ్లోకాలు పఠించండి.

కర్కాటకం (పునర్వసు 4వ, పుష్యమి, ఆశ్లేష 1-4 పాదాలు) :
ముఖ్యమైన పని దాదాపు పూర్తి కావస్తుంది. శ్రమయేవ జయతే అనే విషయాన్ని మర్చిపోకండి. తోటివారి సలహాలు ఉపకరిస్తాయి. ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలను పొందుతారు. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. చేస్తున్న పనిమీద శ్రద్ధ పెంచండి. కుజ, బుధ, శుక్ర ధ్యాన శ్లోకాలు ప్రతిరోజూ పఠించండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) :
అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు అవసరం. బుద్ధిబలంతో ముందుకు సాగాలి. ప్రణాళికలు ఉంటేనే సత్ఫలితాలు సాధిస్తారు. నిదానమే ప్రధానమని గుర్తుంచుకోండి. కొన్ని మంచి అవకాశాలు ఏర్పడతాయి. పెద్దలు – బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉత్సాహంగా ఉండండి. ప్రతిరోజూ ఆదిత్య హృదయం పఠించండి. మేలు జరుగుతుంది.

కన్య (ఉత్తర 2-4, హస్త, చిత్త 1-2 పాదాలు) :
గ్రహసంచారాలు కొంతమేర బాగున్నాయి. మంచి ఫలితాలను పొందుతారు. మీ మీ రంగాల్లో బాగా రాణిస్తారు. కార్యసిద్ధి కలగడానికి ఓర్పు అవసరం. గతంలో వాయిదాపడిన పనులు 1 పూర్తవుతాయి. ఆర్థికంగా బలపడతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ‘జ్ఞా’ ఆరోగ్యంపై శ్రద్ధను కొనసాగించండి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. రవి, కుజ, బుధ ధ్యాన శ్లోకాలు పఠించండి.

తుల (చిత్త 3-4, స్వాతి, విశాఖ 1-3 పాదాలు) :
సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కీలక విషయాల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. ఆర్థిక స్థితి అంతంతమాత్రంగానే ఉంటుంది. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. మనోబలాన్ని తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండాలి. దురాలోచనలకు స్థానమివ్వకండి. రవి, శుక్ర ధ్యానం శుభప్రదం.

వృశ్చికం (విశాఖ 4, అనురాధ, జ్యేష్ట) :
మీ మీ రంగాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగపరంగా శుభఫలితాలు. వ్యాపారంలో లాభాలున్నాయి. అనవసరమైన విషయాల్లో సమయం వృథా చేయవద్దు. ఆర్థికాంశాల్లో అభివృద్ధిని సాధిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రశాంతచిత్తంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. శత్రువులతో జాగ్రత్త, వివాహ యత్నాలకు అనుకూల కాలం. కుజ, బుధ, శుక్ర ధ్యాన శ్లోకాలు పఠించండి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) :
గ్రహయోగం అనుకూలం. ధనధాన్యవృద్ధి. కార్యసిద్ధి. భోజన సౌఖ్యం, శుభాలాభాలున్నాయి. కీలక వ్యవహారాల్లో బుద్ధిబలం కాపాడుతుంది. ఉద్యోగ విషయాలు సానుకూలతలు ఉంటాయి. ఆశయాలు నెరవేరతాయి. వ్యాపారంలో లాభాలున్నాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. నెలచివర్లో శుభం చేకూరుతుంది. ఖర్చులు నియంత్రించుకోవాలి. రవి, బుధ ధ్యానం శుభప్రదం.

మకరం (ఉత్తరాషాఢ 2-4, శ్రవణం, ధనిష్ఠ 1-2 పాదాలు) :
గ్రహయోగ అనుకూలత కొనసాగుతోంది. పెద్దల సహకారంతో అనుకున్నది సాధిస్తారు. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. ఆత్మీయుల సహకారం ఉంటుంది. ఒక సంఘటన తర్వాత ఎవరు ఎలాంటివారో తెలుసుకుంటారు. కుటుంబపరమైన విషయాలకు ప్రాధాన్యతనివ్వండి. నెల చివర్లో కొన్ని శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. రవి, బుధ ధ్యాన శ్లోకాలు పఠించండి. శుభాలు చేకూరుతాయి.

కుంభం (ధనిష్ఠ 3-4, శతభిషం, పూర్వాభాద్ర 1-3 పాదాలు) :
అనుకున్న పనలు సకాలంలో పూర్తిచేస్తారు. తగినంత ప్రయత్నం అవసరం. సామరస్యంగా ఉండండి. తొందరపడి అప్పులు ఇవ్వవద్దు – తీసుకోవద్దు. ఆర్థికంగా శుభఫలితాలున్నాయి. ఆశయాలు సిద్ధిస్తాయి. అలసట దరిచేరనీయకండి. తోటివారి సహకారంతో ఒక మంచి పని పూర్తిచేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాలు సిద్ధిస్తాయి. కుజ ధ్యానం శుభప్రదం.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) :
మిశ్రమ ఫలితాలున్నాయి. ముఖ్యమైన పనులు కొన్నాళ్లు వాయిదా వేయడమే మంచిది. మనోధైర్యంతో అనుకున్నది. సాధిస్తారు. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. కొన్ని పరిస్థితులు మనస్తాపాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం చెప్పదగిన విశేష సూచన. ముందుంది మంచి కాలం. గురు దర్శనంతో మేలు.

Share this post with your friends