March 2025 Horoscope : మార్చి మాసంలో ద్వాదశ రాశుల వారి మాసఫలాలు

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) :

ఇష్టకార్యసిద్ధి. ధనలాభం. వృత్తిఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థికంగా బాగుటుంది. కీలక వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. అనవసర విషయాల్లో మాత్రం కాలయాపన వద్దు. మిమ్మల్ని తప్పుదోవ పట్టించేవారికి దూరంగా ఉండండి. ఆత్మీయుల సలహాలు పాటించండి. నెల చివర్లో చిన్నపాటి ఒడిదుడుకులు, బుధ, శుక్ర శ్లోకాలు పఠించండి.

వృషభం (కృత్తిక 2-4. రోహిణి, మృగశిర 1-2 పాదాలు) :

అనుకూల గ్రహయోగంతో శుభయోగాలు. కాలాన్ని అభివృద్ధి కోసమే సద్వినియోగం చేసుకోండి. వ్యాపారంలో లాభాలు సొంతమవుతాయి. వృత్తిఉద్యోగాల్లోనూ సానుకూల కాలం. ఆర్థికంగా బాగుంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పట్టుదలతో అనుకున్నది. సాధిస్తారు. మరిన్ని శుభాలకోసం లక్ష్మీదేవి నామస్మరణ చేయాలి.

మిథునం (మృగశిర 3-4 ఆర్ద్ర పునర్వసు 1-3 పాదాలు) :

శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వత్తిడి కలగకుండా ప్రణాళికలు వేసుకోండి. కుటుంబసభ్యులతో మాట పట్టింపులు వద్దు. వారి సలహాలు మీకు మేలు చేస్తాయి. అనవసర విషయాలతో సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఖర్చులపై నియంత్రణ కొనసాగించండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మధ్యవర్తిత్వాలు చేయవద్దు. ఇష్టదేవతారాధన, నవగ్రహ ధ్యానం చేసుకోండి.

కర్కాటకం (పునర్వసు 4వ, పుష్యమి, ఆశ్లేష 1-4 పాదాలు) :

గ్రహబలం అంత అనుకూలం కాదు. చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించండి. ఖర్చులు నియంత్రించుకోవడం ముఖ్యమైన సూచన. వృత్తిఉద్యోగవ్యాపారాల్లో వృద్ధి. కుటుంబ సభ్యులతో విభేదించకండి. భవిష్యత్ ప్రణాళికలు కొన్ని అమలు చేయగలుగుతారు. విరోధులకు దూరంగా ఉండండి. రవి, కుజ, బుధ శ్లోకాలు పఠించండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) :

గ్రహయోగం అనుకూలిస్తోంది. ఆర్థికంగా శుభకాలం, చెల్లింపులు పూర్తిచేసుకోగలుగుతారు. చేపట్టి పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగపరంగా శుభవార్తలు వింటారు. ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వండి. కుటుంబసభ్యులతో అనుబంధం పెరుగుతుంది. మనస్సు స్థిమితంగా ఉన్నప్పుడే ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయం తీసుకోండి. విష్ణు సహస్రనామాన్ని పఠించండి.

కన్య (ఉత్తర 2-4, హస్త, చిత్ర 1-2 పాదాలు) :

మిశ్రమ ఫలితాలు. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కాశించిన లక్ష్యం కోసం బాగా శ్రమించాలి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. ఆవేశపూరిత వాతావరణానికి దూరంగా ఉండండి. ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. నవగ్రహ స్తోత్ర పఠనం మేలు చేస్తుంది.

తుల (చిత్త 3-4, స్వాతి, విశాఖ 1-3 పాదాలు) :

వృత్తిఉద్యోగాల్లో శుభకాలం. వ్యాపారంలో నష్టపోకుండా వ్యవహరించాలి. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. కీలక వ్యవహారాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. తెలియని ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక – ఆరోగ్యపరంగా చిన్నపాటి ఇబ్బందులు ఉండవచ్చు. అనవసర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కుజ, శుక్ర ధ్యానం చేయండి.

వృశ్చికం (విశాఖ 4, అనురాధ, జ్యేష్ట) :

చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురుకాకుండా చూసుకోవాలి. కీలక విషయాల్లో తెలివిగా వ్యవహరించి మంచి పేరు సంపాదిస్తారు. ఆర్థికంగా శుభఫలితాలు. ఒక వార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. నెల చివర్లో మేలు జరుగుతుంది. ఖర్చులు నియంత్రించుకోవాలి. మీ మీ రంగాల్లో సామాన్య ఫలితాలు. రవి, కుజ, బుధ గ్రహాదేవతలను స్మరించండి.

ధనుస్సు (మూల, పూర్వాషాడ, ఉత్తరాషాఢ 1వ పాదం) :

అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. కార్యసిద్ది ఉంది. పనితీరుకు తగిన ప్రశంసలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల వాతావరణం కనిపిస్తోంది. బంధుమిత్రులు సహకారంతో కీలక పనులు పూర్తిచేయగలుగుతారు. ఆవేశాలకు దూరంగా ఉండటం కొనసాగించండి. ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. రవి, కుజ శ్లోకాలు చదివితే మంచిది.

మకరం (ఉత్తరాషాఢ 2-4, శ్రవణం, ధనిష్ఠ 1-2 పాదాలు) :

గ్రహబలం బాగుంది. శుభ ఫలితాలున్నాయి. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగుతారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారంలో ఆర్థిక లాభాలుంటాయి. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. శత్రువులు మిత్రులవుతారు. ఒక శుభవార్త శక్తినిస్తుంది. కుటంబ వాతావరణం బాగుంటుంది. బుధ శ్లోక పఠనం మరింత శుభప్రదం.

కుంభం (ధనిష్ఠ 3-4, శతభిషం, పూర్వాభాద్ర 1-3 పాదాలు) :

మిశ్రమ కాలం నడుస్తోంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ముందుస్తు ప్రణాళికలు అవసరం. అనవసరమైన ఖర్చులు నియంత్రించండి. అనారోగ్యం కాస్త ఇబ్బంది పెడుతుంది. శారీరక శ్రమ అధికం. ఎవ్వరితోనూ వాదనలు వద్దు, విభేదాలూ వద్దు, ఆస్తి క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) :

మధ్యమ ఫలితాలుంటాయి. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. వృత్తి ఉద్యోగాది రంగాల్లో పట్టుదల అవసరం. అనవసరమైన ఆందోళనలు విడిచిపెట్టండి. ఆత్మీయులు సహకారం లభిస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. వృధా ఖర్చులు ఉంటాయి. అనవసర విషయాలకు దూరంగా ఉండండి. ఉత్తమ ఫలితాల కోసం నవగ్రహ దర్శనం, దుర్గా స్తుతి చేయండి.

Share this post with your friends