మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) :
ధనలాభం. మంచి ఆరోగ్యం ఉంటుంది. సుఖసంతోషాలు కలుగుతాయి. కుటుంబసౌఖ్యం ఉంటుంది. అన్నింటా శుభాల పరంపర కొనసాగుతుంది. మంచి విజయాలు సొంతం చేసుకుంటారు. కీలక విషయంలో మీ నిర్ణయానికి ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. చిన్నపాటి సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. మరిన్ని శుభాలకు రవి, కుజ శ్లోకాలు పఠించండి.
వృషభం (కృత్తిక 2-4, రోహిణి, మృగశిర 1-2 పాదాలు) :
ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం ఇది. నిర్లక్ష్యాన్ని దరిచేరనీయకండి. ముఖ్య విషయాల్లో కుటుంబసభ్యుల సూచనలు పాటించండి. అనుకున్నది సాధించేవరకు పట్టుదల వదలకండి. వివాదాలకు దూరంగా ఉండండి. దైవబలం మీ వెంటే ఉండి కాపాడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ద వహించండి. మాటలో పొదుపుగా ఉండడం నేర్చుకోండి. నవగ్రహ ఆరాధన శుభప్రదంగా ఉంటుంది.
మిథునం (మృగశిర 3-4, ఆర్ద్ర, పునర్వసు 1-3 పాదాలు) :
మిశ్రమ కాలం నడుస్తోంది. ముఖ్య వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరి. మనోధైర్యంతో పనులు పూర్తిచేస్తారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. వాదోపవాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. సవగ్రహ ఆరాధనతో మరిన్ని శుభాలు.
కర్కాటకం (పునర్వసు 4వ, పుష్యమి, ఆశ్లేష 1-4 పాదాలు) :
అనుకూల గ్రహయోగంతో విశేష శుభఫలితాలు దక్కుతాయి. మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా జాగ్రత్తతోనే వ్యవహరించాలి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించండి. కుజ స్తోత్రం పఠించండి. దుర్గాలయం దర్శించండి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) :
చేపట్టే పనుల్లో విఘ్నాలు ఎదురైనా అధిగమించాలి. ఆర్థికపరమైన జాగ్రత్తలు అత్యంత అవసరం. వృధా ఖర్చులు చేయవద్దు. కీలక విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సమయానికి నిద్రాహారాలు అవసరం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్లకు దూరంగా ఉండండి. ఉద్యోగ వ్యాపారపరంగా బాగుంటుంది. కొత్త పరిచయాలు మేలు చేస్తాయి. నవగ్రహ ధ్యానం శుభప్రదం.
కన్య (ఉత్తర 2-4, హస్త, చిత్త 1-2 పాదాలు) :
లక్ష్యాలు నెరవేరతాయి. శుభం చేకూరుతుంది. చేపట్టిన పనులు ప్రణాళికబద్ధంగా పూర్తిచేస్తారు. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు. రుణాలు పెరగకుండా చూసుకోండి. వ్యాపారంలో మంచి ఫలితాలు సాధిస్తారు. మీ ముందుచూపుతో ప్రశంసలు అందుకుంటారు. నెలచివర్లో మరిన్ని శుభాలు కలుగుతాయి. కుటుంబపరంగా అన్యోన్యతలు ఏర్పడతాయి. రవి, కుజ, బుధ శ్లోకాలు వరించండి.
తుల (చిత్త 3-4, స్వాతి, విశాఖ 1-3 పాదాలు) :
ఆశించిన ఫలితాలకోసం బాగా శ్రమించాలి. ఓర్పుగా వ్యవహరిస్తేనే మేలైన ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. మొహమాటాలతో ఇబ్బందులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు సూచితం. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సామాన్య ఫలితాలుంటాయి. నవగ్రహ ధ్యానం శుభప్రదంగా ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనురాధ, జ్యేష్ట) :
అర్థికపరంగా అనుకూలం. ఖర్చులు మాత్రం జాగ్రత్త. వృత్తి ఉద్యోగాల్లో కృషికి తగిన ఫలితాలు. ఆటంకాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. తోటివారితో ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలి. అపార్థాలకు తావివ్వకండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. నెల చివర్లో అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి. రవి, బుధ, శుక్ర ధ్యాన శ్లోకాలు పఠిస్తే మేలు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) :
ప్రయత్నాలు సిద్ధిస్తాయి. వస్త్రధాన్యాధి లాభాలు దక్కుతాయి. ఆర్థికంగా బలపడతారు. అప్పులకు దూరంగా ఉండండి. ఉద్యోగులకు శుభకాలం నడుస్తోంది. ఎవ్వరితోనూ అభిప్రాయభేదాలు రాకుండా చూసుకోవాలి. నెల మధ్య నుంచి చిన్నపాటి ఇబ్బందులు ఏర్పడవచ్చు. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. కుటుంబ బంధాలకు ప్రాధాన్యత ఇవ్వండి. కుజ, శుక్ర ధ్యానం శుభప్రదంగా ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2-4, శ్రవణం, ధనిష్ఠ 1-2 పాదాలు) :
ఆటంకాలు ఎదురైనా అధిగమించి లక్ష్యాన్ని చేరుకుంటారు. మీ మీ రంగాల్లో అనుకూలతలు ఏర్పడతాయి. ఆర్థిక లాభాలు ఉంటాయి. ఖర్చుల విషయంలో ముందుచూపు అవసరం. కీలక విషయాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. భోజన సౌఖ్యం ఉంది. కుటుంబసభ్యుల మధ్య భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. హనుమంతుని ఆరాధించండి.
కుంభం (ధనిష్ఠ 3-4, శతభిషం, పూర్వాభాద్ర 1-3 పాదాలు) :
సంయమనంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధిస్తారు. ఆర్థికాంశాలు అనుకూలిస్తాయి. మీకు అడ్డుతగిలే వారితో జాగ్రత్త, వాదోపవాదాలతో కాలాన్ని వృధా చేయకండి. ఒక వార్త సంతోషాన్నిస్తుంది. బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు. గృహ – వాహన మార్పులకు ప్రయత్నిస్తారు. రుణాలు తీరేలా చక్కని ఆదాయ వృద్ధి ఉంటుంది. సుర్యారాధన మేలు చేస్తుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) :
చేపట్టిన పనుల్లో ఇబ్బందులు అధిగమిస్తారు. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. విందువినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. ఒక సంఘటన ఇబ్బంది కలిగిస్తుంది. ప్రయాణ సౌఖ్యం ఉంది. డబ్బు పొదుపే కాదు… మాట పొదుపు పాటించండి. నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయండి.