మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) :
శ్రేష్ఠమైన కాలం. శత్రువులపై విజయం సాధిస్తారు. ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. చేపట్టిన పనుల్లో ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితాన్ని సాధించగలుగుతారు. కీలక విషయాల్లో పెద్దలను కలుస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక అనుకూలతలున్నాయి. అయితే.. అన్నింటా సంయమనం అవసరమని గుర్తుంచుకోండి. ఆచితూచి అడుగేయండి. రవి, కుజ శ్లోకాలు పఠించండి.
వృషభం (కృత్తిక 2-4, రోహిణి, మృగశిర 1-2 పాదాలు) :
ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది. కీలక వ్యవహారాల్లో సంపూర్ణ అవగాహన ఉంటేనే ముందడుగు వేయండి. వృత్తి వ్యాపారాల్లో జాగ్రత్తలు అవసరం. పై అధికారులతో జాగ్రత్తగా ఉండండి. మొహమాటాన్ని దరిచేరనీయకండి. ఆర్థికంగా మధ్యమ ఫలితాలు దక్కుతాయి. కుటుంబసభ్యుల సహకారం తప్పనిసరి. వాహన యోగం. నవగ్రహ స్తుతి పఠించండి. విష్ణు ఆరాధన చేయండి.
మిథునం (మృగశిర 3-4, ఆర్ద్ర, పునర్వసు 1-3 పాదాలు) :
కీలక వ్యవహారాల్లో ముందుచూపు అవసరం. చిన్నపాటి ప్రతికూలతలు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో శ్రమ పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభదాయక ఫలితాలు దక్కుతాయి. మీ ఇంట శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక లాభాలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ కొనసాగించండి. కుటుంబసభ్యుల సహకారంతో నూతన కార్యాలు చేపడతారు. రవి ధ్యానం శుభప్రదంగా ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4వ, పుష్యమి, ఆశ్లేష 1-4 పాదాలు) :
మిశ్రమ కాలం. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. లక్ష్యాన్ని చేరేవరకు ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. కీలక విషయాల్లో పెద్దలను కలుస్తారు. ఆర్థికపరమైన సమస్యలు పెరగకుండా చూసుకోండి. ఆరోగ్యపరంగా చిన్నపాటి ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులకు మంచి కాలం గడుస్తోంది. వాహన యోగం ఉంటుంది. రవి, కుజ, బుధ ధ్యాన శ్లోకాలు పఠిస్తే మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) :
గ్రహయోగం అనుకూలిస్తోంది. మీ మీ రంగాల్లో మంచి ఫలితాలున్నాయి. అధికారుల ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది. వృత్తిలో ఎదుగుదల కనిపిస్తోంది. ఆర్థికంగా బాగుంటుంది. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. శుభకార్యాల కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి రావచ్చు. నెల మధ్య నుంచి కొన్ని చికాకులున్నా అధిగమిస్తారు. కుజ, బుధ ధ్యాన శ్లోకాలు పఠించండి.
కన్య (ఉత్తర 2-4, హస్త, చిత్త 1-2 పాదాలు) :
ధనలాభం. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగపరంగా శుభపరిణామాలు. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. వ్యాపారంలోనూ శుభఫలితాలు. శత్రువులపై విజయం సాధిస్తారు. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. ఆర్థిక – ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించండి. కుజ, శుక్ర ధ్యాన శ్లోకాలు పఠిస్తే మేలు.
తుల (చిత్త 3-4, స్వాతి, విశాఖ 1-3 పాదాలు) :
మిశ్రమకాలం. చిత్తశుద్ధితో పనిచేస్తే శుభఫలితాలు పొందుతారు. ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రుల సహకారంతో సమస్యలను అధిగమించగలుగుతారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. స్థాన చలన సూచనలు. అనవసరమైన ఆందోళనలకు లోనుకావద్దు, ప్రయాణాల్లో జాగ్రత్త. ఖర్చులు నియంత్రించుకోండి. గణపతి దర్శనం మేలు చేస్తుంది.
వృశ్చికం (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) :
ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ తీసుకోండి. ఆదాయం బాగానే ఉన్నా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన విషయాల్లో పట్టుదల అవసరం. ఉచిత సలహాలిచ్చేవారికి దూరంగా ఉండండి. కీలక నిర్ణయాలు తీసుకునేముందు కుటుంబసభ్యులతో చర్చించండి. చక్కటి కార్యసిద్ధి ఉంది. వివాదాలకు దూరంగా ఉండండి. అనవసర విభేదాలు వద్దు. రవి, బుధ ధ్యాన శ్లోకాలు పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) :
స్వల్ప గ్రహబలం. చేపట్టే పనుల్లో శ్రద్ధ అవసరం. కొత్త బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. తోటివారి సూచనలు. పాటించడం ఉత్తమం. మీ మీ రంగాల్లో పరిధిని మించిన విషయాల్లో తలదూర్చకండి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వృత్తి ఉద్యోగాల్లో అంకితభావంతో పనిచేయాలి. బంధుమిత్రులతో ప్రయోజనాలు తక్కువగానే ఉంటాయి. కుజ, శుక్ర ధ్యాన శ్లోకాలు పఠించండి.
మకరం (ఉత్తరాషాఢ 2-4, శ్రవణం, ధనిష్ఠ 1-2 పాదాలు) :
గ్రహబలం స్వల్పంగా. ఉద్యోగపరంగా మీ పై అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకర వాతావరణం. ప్రణాళికబద్ధంగా ముందుకు వెళితేనే పనులు పూర్తిచేయగలుగుతారు. కొందరి ప్రవర్తన మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది. వాదోపవాదాలు వద్దు. కొన్ని సమస్యలు వాటంతట అవే పరిష్కారమవుతాయి. కుజ, బుధ, శుక్ర శ్లోకాల పఠనం మేలు.
కుంభం (ధనిష్ఠ 3-4, శతభిషం, పూర్వాభాద్ర 1-3 పాదాలు) :
ముఖ్యమైన విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థికంగా పొదుపు సూత్రాన్ని పాటించండి. అవసరానికి తగిన సాయం అందుతుంది. ఉద్యోగులకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. అనుకున్నది సాధించేవరకు పట్టువదలకండి. వాదోపవాదాలకు దూరంగా ఉండండి. శత్రుబాధ తొలుగుతుంది. సూర్యారాధన, ఆదిత్య హృదయ పారాయణతో శుభఫలితాలు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) :
మిశ్రమ పరిస్థితులు. చేపట్టే పనుల్లో ఏకాగ్రత చాలా అవసరం. అధికారులతో – పెద్దలతో జాగ్రత్తగా వ్యవహరించండి. చంచల బుద్ధితో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యకార్యాల్లో స్పష్టత అవసరం. బంధువులతో విభేదాలు రాకుండా చూసుకోండి. ఆరోగ్యంపై శ్రద్ద వహించండి. వృధా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. స్థానచలన సూచనలు. నవగ్రహ స్తోత్ర పఠనం, ప్రదక్షిణలు చేయండి.