August 2024 Horoscope : ఆగష్టు మాసంలో ద్వాదశ రాశుల వారి మాసఫలాలు

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) :

ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మొహమాటంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొత్తవారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యక్తిగత విషయాల్లో ఇతరుల ప్రమేయం లేకుండా చూసుకోండి. ఆర్థికంగా కలిసి వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో తగినంత మెళకువతో వ్యవహరించండి. అవసరానికి తోటివారి సహాయం అందుతుంది. రవి, కుజ, బుధ శ్లోకాలు తో మరింత మేలు కలుగుతుంది.

వృషభం (కృత్తిక 2-4, రోహిణి, మృగశిర 1-2 పాదాలు) :

ఆశించిన ఫలితాలు పొందుతారు. సమాజంలో మంచి పేరుప్రతిష్టలు లభిస్తాయి. ధన ధాన్యాభివృద్ధి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా పాటించండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అంకిత భావంతో పనిచేయాలి. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దుర్గాదేవిని దర్శించండి. కుజ శ్లోకం పఠించండి.

మిథునం (మృగశిర 3-4, ఆర్ద్ర పునర్వసు 1-3 పాదాలు) :

ముఖ్య విషయాల్లో సమయస్ఫూర్తి ప్రదర్శించండి. ఆటంకాలు పెరగకుండా ఉండాలంటే మెళకువగా వ్యవహరించాలి. మనోధైర్యాన్ని కోల్పోవద్దు. అవసరానికి తగిన డబ్బు అందినా ఖర్చులు పెంచుకోవద్దు. కుటుంబ సభ్యులతో వాదోపవాదాలు వద్దు, అనవసర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. నెల చివర్లో తగిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. రవి, కుజ, బుధ ధ్యాన శ్లోకాలు పఠించండి.

కర్కాటకం (పునర్వసు 4వ, పుష్యమి, ఆశ్లేష 1-4 పాదాలు) :

ధనలాభం ఉంది. కుటుంబసౌఖ్యం కలుగుతుంది. మంచి ఆరోగ్యం లభిస్తుంది. ముఖ్యమైన విషయంలో లాభపడతారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. నూతన వస్తుయోగం కలుగుతుంది. బంధుమిత్రుల కారణంగా మేలు జరుగుతుంది. ముందుస్తు ప్రణాళికలతో మాత్రమే విజయానికి దగ్గరవుతారు. నెల చివర్లో వత్తిళ్లు ఉంటాయి. సూర్యారాధన చేయండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) :

ఆర్థికంగా కలిసివస్తుంది. మంచి ఫలితాలు అందుకుంటారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. మన పక్కనే ఉంటూ ఇబ్బందిపెట్టేవారితో జాగ్రత్త. నెల మధ్యలో ఒక వార్త మిమ్మల్ని నిరాశకు గురిచేస్తుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రతలు అవసరం. ముఖ్యమైన విషయాల్లో కీడెంచి మేలెంచే సూత్రాన్ని పాటించండి. నవగ్రహ ధ్యానంతో శుభాలు కలుగుతాయి.

కన్య (ఉత్తర 2-4, హస్త, చిత్త 1-2 పాదాలు) :

మీ మీ రంగాల్లో మంచి ఫలితాలు పొందుతారు. ప్రతిభకు తగిన ప్రశంసలు లభిస్తాయి. కుటుంబసభ్యుల సహకారం. ఉంటుంది. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాల్లో తొందరపాటు పనికిరాదు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థికపరంగా నామమాత్ర ప్రయోజనాలుంటాయి. కుజ, బుధ, శుక్ర శ్లోక పఠనం శుభప్రదం.

తుల (చిత్త 3-4, స్వాతి, విశాఖ 1-3 పాదాలు) :

సంతానపరమైన శుభవార్తలు వింటారు. ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. శ్రమకు తగినట్లుగా మంచి విజయాలను సొంతం చేసుకుంటారు. ఒక కీలక విషయంలో మీ ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబసభ్యులకు శుభకాలం. ఆరోగ్యం సహకరిస్తుంది. కుజ శ్లోక పఠనం మేలు.

వృశ్చికం (విశాఖ 4, అనువాద, జ్యేష్ట) :

స్వల్ప గ్రహబలం. చేపట్టిన పనుల్లో ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. బుద్ధిబలంతో సమస్యలను అధిగమించాలి. సమయానికి నిద్రాహారాలు అవసరం. గిట్టని వారితో జాగ్రత్త. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. అనవసరమైన ఆగ్రహావేశాలకు లోనుకావద్దు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. క్రయవిక్రయాల విషయంలో శ్రద్ధ వహించాలి. దేనిని తేలికగా తీసుకోవద్దు. శ్రీరామ నామస్మరణ చేయండి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) :

చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. విజయాన్ని అందుకుంటారు. అనవసర విషయాలను పెద్దవి చేసి చూడవద్దు. మీ సత్ప్రవర్తనే మిమ్మల్ని కాపాడుతుంది. ముఖ్యమైన లావాదేవీల్లో సొంత నిర్ణయాలు వద్దు, అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ వ్యవహారాలకు ప్రాధాన్యతనివ్వండి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. రవి, బుధ ధ్యాన శ్లోకాలు పఠించండి.

మకరం (ఉత్తరాషాఢ 2-4, శ్రవణం, ధనిష్ఠ 1-2 పాదాలు) :

గ్రహస్థితులు అనుకూలిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ శ్రమ ఫలిస్తుంది. తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు అవసరమవుతాయి. ఆర్థిక విషయాల్లో సమస్యలు తొలగి కుదురుకుంటారు. సమాజంలో నలుగురికీ మేలు జరిగే ప్రణాళికలు అమలు చేస్తారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు. బంధుమిత్రులతో గడుపుతారు. రవి, కుజ, బుధ శ్లోకాలు పఠించండి.

కుంభం (ధనిష్ఠ 3-4, శతభిషం, పూర్వాభాద్ర 1-3 పాదాలు) :

అంత అనుకూలమైన సమయం కాదు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోండి. ఒక వార్త మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ఉద్యోగంలో వత్తిడి పెరుగుతుంది. ఎవ్వరినీ అతిగా నమ్మకండి. ఆరోగ్య, ఆర్థికాంశాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మేలు. నెల చివర్లో ఉత్సాహ వాతావరణం. నవగ్రహ ప్రదక్షిణలు చేయండి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) :

స్వల్ప గ్రహబలం. కష్టేఫలి అన్న విధంగా ఫలితాలు ఉంటాయి. మీ నిర్ణయాలను శ్రేయోభిలాషులు ఆమోదిస్తారు. అవసరానికి సహాయం చేసేవారున్నారు. కుటుంబ వాతావరణం బాగుంటుంది. ఆర్థికంగా నష్టపోకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధను వహించండి. విరోధులను తక్కువ అంచనా వేయవద్దు. ప్రయాణాల్లో జాగ్రత్త. లక్ష్మీ అష్టోత్తరం పఠించండి.

Share this post with your friends