భారతదేశంలో శివాలయాలు ప్రతి గ్రామంలోనూ ఉంటాయి. నగరాల్లో అయితే ప్రతి ఏరియాలోనూ ఉంటాయి. ఈ శివాలయాలు కొన్నింటిలో కొన్ని అద్భుతాలు ఉన్నాయి. అలాంటి అద్భుత ఆలయం ఒకటి ఉంది. ఈ ఆలయంలో శివలింగం ఏడాదికోసారి పెరగడమే కాదు.. కలియుగం ముగింపును సైతం సూచిస్తుంది. ఈ ఆలయంలో మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ ఆలయంలోని నీరు గడ్డకట్టే చలిలో సైతం మరుగుతూనే ఉంటుంది. ఈ ఆలయంలోని ఈ విచిత్రం నేటికీ పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ మిస్టరీని ఛేదించేందుకు చాలా మంది శాస్త్రవేత్తలు యత్నించారు కానీ ఇప్పటి వరకూ అది సాధ్యపడలేదు.
ఇంతకీ ఈ రహస్య దేవాలయం ఎక్కడ ఉంది అంటారా? హిమాచల్‌ప్రదేశ్‌లోని కులుకి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న మణికరణ్‌లో ఈ ఆలయం ఉంది. ఇది ఒక్క హిందువులకే కాకుండా.. సిక్కులకు కూడా చారిత్రాత్మకమైన ప్రదేశం కావడం ఆసక్తికరం. ఇక్కడి మణికరణ్ గుండా పార్వతీ నది ప్రవహిస్తుంది. ఈ పార్వతి నదికి ఒక వైపు శివాలయం, మరొక వైపు మణికర్ణ సాహిబ్ అని పిలువబడే గురు నానక్ కి చెందిన చారిత్రక గురుద్వారా ఉంది. ఇక్కడ వేడి నీరు ఇప్పటికీ ఒక రహస్యం. ఈ రహస్యంపై శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేసినా కూడా రహస్యం తెలుసుకోలేకపోయారు.