యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో ఈ నెల 14వ తేదీ నుంచి 16 వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు కొనసాగనున్నాయి. పవిత్రోత్సవాల సందర్భంగా ఆలయంలో భక్తులచే జరపబడే నిత్య, శాశ్వత కల్యాణం, బ్రహ్మోత్సవం, లక్ష పుష్పార్చన,నరసింహ హోమం రద్దు చేసినట్టు ఆలయ అధికారులు ప్రకటించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయ పునర్నిర్మాణం తరువాత చాలా మార్పులు తీసుకొచ్చారు. ఈ ఆలయంలో గిరి ప్రదక్షిణను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. అలాగే పుష్కరిణి సైతం అందుబాటులోకి ఆలయ అధికారులు తీసుకొచ్చారు.
త్రేతాయుగంలో భోంగీర్ (భువనగిరి), రాయగిరి (ప్రస్తుతం నల్గొండలో) మధ్య ఉన్న ఈ కొండపై ఆంజనేయుడి ఆశీర్వాదంతో ఒక గుహలో యాదరిషి అనే మహర్షి నివసించారు తపస్సు చేశాడు. అతని భక్తికి సంతోషించిన నరసింహ భగవానుడు తన అవతారాలైన శ్రీ జ్వాలా నరసింహ, శ్రీ యోగానంద, శ్రీ గండభేరుండ, శ్రీ ఉగ్ర, శ్రీ లక్ష్మీనరసింహ వంటి ఐదు విభిన్న రూపాలలో అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. ఈ ఐదు రూపాల్లోనూ ప్రస్తుతం ఆలయంలో లక్ష్మీ నరసింహ స్వామి పూజలు అందుకుంటున్నాడు. అప్పటి నుంచి ఈ క్షేత్రం పంచ నరసింహ క్షేత్రంగా పేరుగాంచింది.